మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరిజిన్ డెయిరీ సీఈవో శేజల్ చేసిన ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.
శేజల్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపాలంటూ తెలంగాణ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.
సమగ్ర విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ క్రమంలోనే పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ కోరింది.