సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మంచి కోసం ఉపయోగించుకోకం మరికొందరు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎంతోమంది ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ వారిని బెదిరించి డబ్బులు లాగడం వంటివి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఇలాంటి ఇబ్బందులను కేవలం సాధారణ మహిళలు మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రిటీ లో కూడా ఎదుర్కొంటున్నారు.ఈ మధ్యకాలంలో డీప్ ఫేక్ ( Deep Fake ) వీడియోలు ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి ఇలాంటి వాటికి ఎంతోమంది సెలబ్రెటీలు బాధితులయ్యారు.
ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి రష్మిక మందన్న ( Rashmika Mandanna )కూడా డీప్ ఫేక్ బాధితురాలనే విషయం మనకు తెలిసిందే.ఈమె ఫోటోను మార్ఫింగ్ చేస్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.అయితే ఇది ఫేక్ అంటూ వెంటనే అభిమానులు ఒరిజినల్ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పిలుచుకున్నారు అయితే ఈ వీడియో చూసి రష్మిక కూడా ఆవేదన వ్యక్తం చేశారు.ఇలా రష్మిక డీప్ ఫేక్ వీడియో పై ఎంతో మంది సినిమా సెలబ్రిటీలో స్పందిస్తూ ఆమెకు మద్దతుగా నిలబడ్డారు.
తాజాగా రష్మిక యానిమల్( Animal ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పాల్గొన్నటువంటి రష్మికకు ప్రముఖ రిపోర్టర్ సురేష్ కొండేటి( Suresh Kondeti) డీప్ ఫేక్ వీడియో బాగా వైరల్ అయింది కదా దీనిపై మొదటిసారి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ ఇది సినిమా ఈవెంట్ ఇక్కడ ఇలాంటి విషయాలు గురించి మాట్లాడుకోవడం సరికాదు కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్న అంటూ సమాధానం చెప్పారు.
తన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా తాను భయపడిపోయానని తెలిపారు.ఇలాంటి వాటి గురించి స్పందించాలా లేదా అన్న అయోమయంలో నేను పడ్డానని ఈమె తెలియజేశారు.అయితే ఈ వీడియో పట్ల మొదటిసారి అమితాబ్ బచ్చన్( Amithab Bachchan ) సార్ గారు రియాక్ట్ అవ్వడం తనకు చాలా సంతోషం కలిగించిందని తెలిపారు.ఇలా సార్ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తనకు ఎంతో సపోర్ట్ చేయడంతో తప్పనిసరిగా ఈ ఘటనపై నేను స్పందించాలని చెప్పేసి ఈమె ఈ వీడియో పై స్పందించానని కానీ ఇలాంటి వాటికి నేనొక్కదానినే బాధితురాలు కాదని తర్వాత ఎంతోమంది ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిసింది అంటూ రష్మిక ఈ సందర్భంగా డీప్ ఫేక్ వీడియో పట్ల యానిమల్ ప్రమోషన్లలో చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.