ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ( TDP Party )పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్( Nara Lokesh ) చేపట్టిన “యువగళం” ( Yuvagalam ) పాదయాత్ర ఇప్పుడు కడపలోకి( Kadapa ) ప్రవేశించింది.కర్నూలు జిల్లాలో 40 రోజుల సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేష్ వయా జమ్మలమడుగు కడపలో ప్రవేశిస్తున్నారు.
ఒకప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపికి కంచుకోటగా ఉండేది శివారెడ్డి హయంలో ఆయన తర్వాత ఆయన కుమారుడు రామసుబ్బారెడ్డి టిడిపి నుంచి అనేక సార్లు గెలుపొందారు.అయితే బలంగా వీచిన జగన్ గాలిలో 2019లో సుబ్బారెడ్డి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఉన్నారు.
ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ తరఫున డాక్టర్ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు .
తాను ప్రవేశించిన ప్రతి జిల్లాలో అక్కడి స్థానిక ప్రజా ప్రతినిధులను, ఎమ్మెల్యే, ఎంపీలను విమర్శిస్తూ, ప్రభుత్వ విదానాలను ఎండగడుతూ వస్తున్న లోకేష్ కడపలో కూడా అదే రకంగా విమర్శలు చేస్తారు అని తెలుగు దేశం శ్రేణులు చెపున్నాయి ….అయితే కడప జిల్లా ముఖ్యమంత్రి కి సొంత నియోజకవర్గం, అంతే కాకుండా ఇది జగన్ అడ్డాగా చెబుతుంటారు.వైసిపి పార్టీ పెట్టినప్పటి నుంచి అక్కద వైసీపీ తిరుగులేని ఫలితాలను సాధిస్తుంది .ఇలాంటి వాతావరణంలో ఇప్పుడు లోకేష్ కడప జిల్లా పర్యటన లో జగన్ పై విమర్శలు చేస్తే ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలలో వేడి పెరుగుతుంది.దాంతో లోకేష్ పర్యటన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఎక్కడకక్కడ మాటల తూటాలతో అధికార పక్షాన్ని ఇరుకున పెడుతున్న లోకేష్ కడపలో కూడా తనదైన శైలిలో విమర్శలు చేస్తే దానికి వైసిపి నేతల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ వాతావరణం ప్రస్తుతం కడపలో నెలకొన్నట్లుగా చెబుతున్నారు.ప్రస్తుతం ఇప్పటికే కడపలో వైయస్ అవినాష్ రెడ్డి -సిబిఐ వ్యవహారాలతో పరిస్థితి హాట్ హాట్ గా ఉంది .మరి ఇప్పుడు దానికి లోకేష్ పర్యటన వేడి కూడా జతకలిస్తే మరింత సెన్సిటివ్ గా వాతావరణం మారే అవకాశం ఉందని పోలీస్ శాఖ టెన్షన్ పడుతున్నట్లుగా సమాచారం .ఇప్పటికే రాయలసీమలో మూడు జిల్లాలను పర్యటనను పూర్తి చేసుకున్న లోకేష్ ఆయా జిల్లాలో సుదీర్ఘంగా పర్యటించారు కడప జిల్లాలో కూడా లోకేష్ పర్యటన చాలా రోజులు ఉండబోతున్నట్టు సమాచారం.వైసిపి స్లోగన్ వై నాట్ కుప్పం కి ప్రతిగా వై నాట్ పులివెందుల? అంటూ ముందుకెళ్తున్న తెలుగుదేశం కడప జిల్లా పై భారీగానే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది .