యాచారం మండలం( Yacharam Mandal ) గున్గల్ గ్రామంలో సోమవారం శ్రీ బీరప్ప స్వామి( Sri Beerappa Swamy ) వారి కమరవతిదేవీల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.ఇంకా చెప్పాలంటే కురుమ కుల ఆచారం మేరకు ఒగ్గు కళాకారులు ఒగ్గు కథ చెప్పారు.
అలాగే దేవాలయం నుంచి స్వామివారిని ఉదయం పదిన్నర గంటలకు గద్దె పైకి చేర్చి అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మంచి రెడ్డి మాట్లాడుతూ కుల ఆచార వ్యవహారాలను సంరక్షించుకునేందుకు కురుమలు తరచూ ఇలాంటి ఉత్సవాలు జరపడం అభినందనీయమని తెలిపారు.అదే విధంగా బీరప్ప స్వామి పండుగకు పురాతన కాలం నుంచి ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య, బీఆర్ఎస్ యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి( Manchireddy Prashanth Kumar ), బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, నాయకులు చీరాల రమేష్, అచ్చన్న ,దానయ్య, అచ్చన్న, భాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అలాగే ఫరూఖ్ నగర్ మండలం మొలిగిద్ద శివారులోని రంగధాములలో వెలిసిన శ్రీ గోదా రంగనాయక స్వామిని సోమవారం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ దర్శించుకున్నారు.అదే విధంగా వార్షిక బ్రహ్మోత్సవాల లో భాగంగా జరుగుతున్న ఉత్సవాల్లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.ముఖ్యంగా చెప్పాలంటే పూజల తర్వాత పండితులు ఆయనకు ఆశీర్వాదాలను అందించారు.
ఈ కార్యక్రమంలో పూజారులు కేశవాచార్యులు, పురుషోత్తమాచార్యులు, రాజగోపాలచార్యులు, నాయకులు రాము, రాధాకృష్ణ, శ్రీశైలం, బాలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
.DEVOTIONAL








