రాముడు, సీతా, లక్ష్మణుడు, హనుమంతుడు దేశంలోని ఏ రామాలయంలో చూసిన ఈ నలుగురు ఖచ్చితంగా ఉంటారు.ఇక రామాలయంలో ఘట్టాన్ని పరిశీలిస్తే జననం మొదలుకొని పట్టాభిషేకం రాముడిని( Lord Rama ) విడిచి లక్ష్మణుడు( Lakshmana ) ఉండలేదని పురాణాలలో ఉంది.
కానీ నిజామాబాద్ జిల్లాలోని లక్ష్మణుడు లేకుండానే సీతా సమేతంగా శ్రీరాముడికి దేవాలయం ఉంది.ఇక్కడ లక్ష్మణుడు లేకుండానే శ్రీరామనవమి( Sri Rama Navami ) వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.
వేకువ జామున నుంచే భక్తులు రామాలయాలకు రావడంతో రామాలయం శ్రీ రామ నామస్మరణతో మార్మోగింది.ఎల్లప్పుడూ రాముడికి తోడు నీడగా ఉండే లక్ష్మణుడు లేకుండా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గ్రామంలో( Indalwai village ) రామాలయం ఉంది.మిగతా దేవాలయాలతో పోలిస్తే ఈ రామాలయానికి ఒక ప్రత్యేకత ఉంది.ఈ దేవాలయంలో లక్ష్మణుడు లేకుండానే హనుమంతుడు సీతా సమేతంగా శ్రీరాముడు కొలువుదిరాడు.ఒకసారి ఈ దేవాలయం చరిత్రను పరిశీలిస్తే సుమారు 230 సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల కాలంలో శ్రీమతి శీలం జానకి బాయి వంశీయులు నిర్మించినట్లు చరిత్రలో ఉంది.
అంతేకాకుండా కాశి చరిత్ర అనే పుస్తకంలో ఏనుగుల వీరస్వామి అనే సుప్రీంకోర్టు జడ్జి మద్రాస్ నుంచి కాశీ యాత్ర గా వెళ్తూ 1830 జూలై 22వ తేదీన ఇందల్వాయి దేవాలయాన్ని సందర్శించినట్లు కూడా స్థానికులు చెబుతూ ఉంటారు.ఈ దేవాలయం చుట్టూ 30 మంది బ్రాహ్మణుల అగ్రహారం ఉండేదని పూర్వీకులు చెప్పినట్లు సమాచారం.ముఖ్యంగా చెప్పాలంటే దీనిని పరిశీలించిన ఆయన అప్పటి నిజం దాటికి తట్టుకొని బురదలో కమలం వలే వికసిస్తున్న దేవాలయం అని ఆకాశ చరిత్ర పుస్తకంలో రాసినట్లు చరిత్ర చదివిన వారు చెబుతున్నారు.
అయితే మన దేశంలో సీతా సమేతంగా శ్రీరాముడు హనుమంతుడు ఉండి లక్ష్మణుడు లేని ఆలయంగా ప్రజలలో ప్రాచుర్యం పొందింది.భారతదేశంలోనే ఇది మొదటి దేవాలయం కావడం మరో విశేషం.