కర్ణాటకలోని మంగళూరు ఆటో బ్లాస్ట్ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి.పేలుడు ఘటన ఉగ్ర కుట్రనేనని కర్ణాటక పోలీసులు తేల్చారు.
కుక్కర్ లో అమర్చిన ఐఈడీ పేలిందని నిర్ధారించారు.సిటీలో పేల్చేందుకు ప్రయత్నించగా ముందుగానే పేలిందని గుర్తించారు.
పీఎఫ్ఐను బ్యాన్ చేయడానికి వ్యతిరేకంగా పేలుడుకు కుట్ర పన్నారని అధికారులు తెలిపారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎన్ఐఏ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించాయి.
అదేవిధంగా ఆటోలో లభించిన ఆధార్ కార్డ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇప్పటివరకు ఆటోలో ఉన్నది ప్రేమ్ రాజ్ అని భావించిన పోలీసులు.
చిరునామా ఆధారంగా హుబ్లీ వెళ్లారు.ఈ క్రమంలో ప్రేమ్ రాజ్ అనే రైల్వే ఉద్యోగి ఆధార్ కార్డు మిస్సైనట్లు గుర్తించారు.
ఆటోలో దొరికిన ఆధార్ నకిలీదని తేల్చారు.