ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ యూజర్లు వున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.ఈ క్రమంలో వాట్సాప్ తన యూజర్లను మరింత సంతృప్తి పరచడం కోసం అనేక ఫీచర్లు తీసుకువస్తోంది.
ఈ క్రమంలోనే పోల్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.ఇందులో భాగంగా ఒక ప్రశ్నకు 12 వరకు ఆప్షన్లు ఇచ్చే సౌకర్యాన్ని కలిగించింది.
ట్విట్టర్, యూట్యూబ్ మాదిరిగా పోల్స్ క్రియేట్ చేసే ఆప్షన్ తీసుకొచ్చింది.ఆండ్రాయిడ్, iOS వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుందని వాట్సాప్ తాజాగా తెలిపింది.
ఇక్కడ గుర్తించుకోవలసిన అంశం ఏమంటే ఒక ప్రశ్నకు 12 వరకు ఆప్షన్లు ఇవ్వొచ్చు కానీ ఒకే ఆప్షన్ 2 సార్లు ఇస్తే మాత్రం వాట్సాప్ తీసుకోదు.అయితే ఇపుడు WhatsApp పోల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే విషయం ఒకసారి చూద్దాము.
ఫోన్లో ముందుగా వాట్సాప్ అప్డేట్ అయిందో లేదో చెక్ చేసుకోండి.ఆ తరువాత యాప్ ఓపెన్ చేసి.
పర్సనల్ చాట్ లేదా, గ్రూప్ చాట్ ఓపెన్ చేయాలి.iOS యూజర్లు అయితే.మెసేజ్ బాక్స్ పక్కన ఉన్న ప్లస్ సింబల్ను నొక్కాలి. ఆండ్రాయిడ్ యూజర్లు.పేపర్క్లిప్ సింబల్ను క్లిక్ చేయాలి.

ఇపుడు మీకు వెంటనే ఒక మెనూ ఓపెన్ అవుతుంది.అందులో పోల్‘అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే.కొత్త మెనూ ఓపెన్ అవుతుంది.
ఆ తరువాత పోల్ ప్రశ్నను అడుగుతుంది.తరువాత కింద దీనికి సమాధానాలు యాడ్ చేయాల్సి ఉంటుంది.
సమాధానాల కోసం మొత్తం 12 వరకు ఆప్షన్లు ఇవ్వొచ్చు.ఒక్కసారి ఆప్షన్లన్నీ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ చేస్తే సరిపోతుంది.
పోల్ రిసీవ్ చేసుకున్నవారు ఆన్సర్పై క్లిక్ చేస్తే.ఓటు అనేది నమోదవుతుంది.
తద్వారా ఏ ఆప్షన్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఏ ఆప్షన్ను ఎవరు ఎంచుకున్నారు, ఎంతమంది ఓటేశారనే.విషయాలన్నీ తెలుస్తాయి.







