బుల్లితెర పై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం ఆరవ సీజన్ ప్రసారమవుతుంది.
ఈ సీజన్లో భాగంగా ఇప్పటికే 10 వారాలు పూర్తి అయ్యి నేడు 11వ వారం కూడా పూర్తి కానుంది.ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 6 నుంచి గతవారం కంటెస్టెంట్ వాసంతి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ డాల్ గా ఉన్నటువంటి వాసంతి ఎలిమినేట్ కాగా ఈమె ఎలిమినేషన్ పై ఏమాత్రం బాధపడకుండా ఇన్ని రోజులు పాటు తాను బిగ్ బాస్ హౌస్ లో ఉండడం గ్రేట్ అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే తాను రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తానంటూ చెప్పడమే కాకుండా జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇకపోతే బిగ్ బాస్ హౌస్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ లో ఉండకపోయినా ఆ తర్వాత స్థానాలలో ఉంటానని భావించాను.అయితే ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యానని తెలిపారు.బిగ్ బాస్ హౌస్లో తాను 70 రోజులు ఉన్నానని ఇది సామాన్యమైన విషయం కాదంటూ వెల్లడించారు.

ఇక తాను హౌస్ లో ఉన్నప్పుడు తనకు సంబంధించిన ఏ విషయాలను కూడా ఇతరులతో పంచుకోలేదని అలా తనంతట తానే వెళ్లి తన విషయాలు చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదని తెలిపారు.ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది అందుకే అక్కడ ఉన్న వారందరూ చాలా బరువు తక్కువ అవుతారు.తనకి కూడా ఎక్కువగా మెంటల్ టెన్షన్ ఉండేదని అందుకే ఇలా స్లిమ్ అయిపోయానంటూ తెలియజేశారు.
అక్కడికి మనకు సరిపడే ఫుడ్ ఉన్నప్పటికీ ఆ టెన్షన్ కారణంగా మనం తిన్న ఫుడ్ మన శరీరానికి ఒంట బట్టదు అంటూ ఈమె ఈ సందర్భంగా తెలిపారు
.






