సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.
తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు.
విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.
అయితే ఈ కట్టుబాట్లే ఒక్కొక్కసారి వీరిని సమస్యలకు గురిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే పలు దేశాల్లో తమకు ప్రత్యేక గుర్తింపు కేటాయించాలని సిక్కులు ఆందోళనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అమెరికాలోని షార్లెట్‌లో వున్న యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా కీలక నిర్ణయం తీసుకుంది.సిక్కు విద్యార్ధులు తలపాగా, కత్తిలు క్యాంపస్‌లోకి తీసుకురావడానికి అనుమతినిచ్చింది.ఈ మేరకు ‘Weapons on Campus’ పాలసీకి మార్పులు చేర్పులు చేసింది.ఇటీవల ఈ యూనివర్సిటీకి చెందిన ఓ సిక్కు విద్యార్ధిని తలపాగా ధరించినందుకు గాను అరెస్ట్ చేసిన వ్యవహారం కలకలం రేపింది.
ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

కొత్త పాలసీ ప్రకారం.సిక్కు విద్యార్ధులు తమ వెంటే తెచ్చే కత్తి పొడవు 3 అంగుళాలకు మించరాదు, అలాగే దానిని కోశం (కత్తిని దాచే గొట్టం లాంటి వస్తువు) లో దాచి వుంచాలి.ఈ విధానంలో మార్పులు చేర్పులకు సహాయం చేసిన ‘‘ The Sikh Coalition and the Global Sikh Council’’ సంస్థలకు, సిక్కు నేతలకు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా ధన్యవాదాలు తెలిపింది.
మారిన విధానం తక్షణమే అందుబాటులోకి వస్తుందని, అలాగే సెప్టెంబర్‌లో జరిగిన ఘటనకు క్షమాపణలు కోరింది.







