ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధిల్లీ పర్యటనకు రంగం సిద్ధమవుతోంది.మంగళవారం దిల్లీకి వెళుతున్న చంద్రబాబు అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు.
ప్రస్తుతం ఏపీలో టీడీపీ – బీజేపీ మధ్య విభేదాలు పెరుగుతున్న నేపధ్యంలో, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ప్రజల్లో అసహనం పెరుగుతున్న పరిస్థితిలో చంద్రబాబు ధిల్లీ పర్యటన కీలకంగా మారింది.
మోడీతో బాబు ఏం మాట్లాడుతారు? ఎలాటి హామీలు పొందుతారు? అనే దానిపై పార్టీల్లో, ప్రజల్లో చర్చలు సాగుతున్నాయి.ఈ సమావేశం కోసం చంద్రబాబు బాగానే కసరత్తు చేస్తున్నారు.ఇప్పటికే ఒకసారి మంత్రులతో, అధికారులతో సమావేశమైన సీఎం సోమవారం మళ్ళీ భేటీ అయ్యారు.కేంద్రం చేసిన ఆర్ధిక సాయం పై లెక్కలు సిద్ధం చేసుకున్నారు.కేంద్రం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు తయారు చేసుకున్నారు.
అన్ని అంశాలపై, అన్ని వివరాలతో మోడీ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు.ఈ సమావేశం ద్వారా వచ్చే ఫలితాన్ని బట్టి ఏపీ రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉంది.
మోడీని చంద్రబాబు బతిమాలుతారో, హెచ్చరికలు చేస్తారో చూడాలి.







