చీకట్లో ఎక్స్పోజ్ చేస్తున్న ప్రియాంక జవాల్కర్.. కాస్త కరెంట్ బిల్లు కట్టడండమ్మా అంటూ నెటిజన్స్ ట్రోల్స్?

ఈమధ్య ట్రోల్స్ అనేవి బాగా కామన్ అయిపోయాయి.చాలావరకు ట్రోల్స్ అనేవి సెలబ్రెటీలకు ఎదురవుతూ ఉంటుంది.

 Netizens Are Trolling Priyanka Jawalkar Who Is Exposing Herself In The Dark, Pri-TeluguStop.com

ముఖ్యంగా వాళ్ల వ్యక్తిగత విషయంలోనే ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి.అయితే మొదట్లో నటీనటులు తమపై వచ్చిన ట్రోల్స్ కి వెంటనే స్పందించి తమదైన శైలిలో కౌంటర్లు వేసేవారు.

కానీ ఇప్పుడు మాత్రం లైట్ తీసుకుంటున్నారు.ఎన్ని ట్రోల్స్ వచ్చినా వాటి గురించి పట్టనట్లుగా ఉంటున్నారు.

ఇక హీరోయిన్స్ ల విషయంలో కూడా ట్రోలర్స్ అసలు వదలరు.వాళ్ళు వేసుకునే డ్రెస్ నుంచి ఇచ్చే ఫోజుల వరకు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తూ ఉంటారు.

హీరోయిన్స్ కూడా వాటిని పట్టించుకోకుండా ఇంకా ఎక్కువ చేస్తూనే ఉన్నారు.అందులో ఒకరు ప్రియాంక జవాల్కర్.ఇక ఈ బ్యూటీ కూడా తాజాగా బాగా ట్రోల్స్ ఎదుర్కొంది.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి ప్రియాంక జవాల్కర్.  షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు అందుకొని టాలీవుడ్ లో అడుగు పెట్టింది.అలా తొలిసారిగా  2017 లో కలవరమాయే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమాతో అంతగా కూడా సక్సెస్ అందుకోలేకపోయింది ప్రియాంక.ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన టాక్సీవాలాలో నటించింది.

ఇక కొన్ని రోజుల తర్వాత తిమ్మరుసు సినిమాలో నటించగా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక వెంటనే వచ్చిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకోగా మంచి అభిమానం సంపాదించుకుంది.ఇక మరిన్ని అవకాశాల కోసం ఈ మధ్య గ్లామర్ ను కూడా పరిచయం చేసింది ప్రియాంక.సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో బాగా హల్ చల్ చేస్తుంది.

ఇక ఈ బ్యూటీ మొదట్లో చూడడానికి అంత అందంగా ఆకట్టుకోలేకపోయినా.ఇప్పుడు మాత్రం తెగ గ్లామర్ షో తో అందాల విందు వడ్డిస్తుంది.

నిజానికి గతంలో తాను తన అందం గురించి కూడా ఓపెన్ కామెంట్లు చేసింది.తన మేకప్ వల్లే తను అందంగా ఉన్నానని తెలిపింది.తన అందం విషయంలో తను చాలా ట్రోల్స్ కూడా ఎదుర్కున్నానని.అవి తట్టుకోలేక అందం విషయంలో మరింత నాజూగ్గా, గ్లామర్ గా కనిపించాలని ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపింది.

అలా ప్రస్తుతం తన అందంతో బాగా గ్లామర్ షో చేస్తుంది.తెగ ఫోటో షూట్ లు చేయించుకుంటూ అభిమానులను బాగా ఫిదా చేస్తుంది.సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.నిత్యం ఏదో ఒక ఫోటో తో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాలో ఒక ఫోటో షేర్ చేసుకుంది.అందులో బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది.బ్యాక్గ్రౌండ్ కాస్త చీకటిగా అనిపించడంతో అందులో తను చేసిన గ్లామర్ ఫోజ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

  ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ కాస్త కరెంట్ బిల్లు కట్టడండమ్మా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube