టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.ఈ ఒక్క సినిమాతో ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయిందనే చెప్పాలి.
ఈమె అందం, అభినయం అన్ని కూడా ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తాయి.శ్రీలీల రాఘవేంద్రరావు పర్వేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమా ద్వారా వెండి తెరమీద అడుగు పెట్టింది.
ఈ సినిమా తర్వాత శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో దూసుకు పోతుంది.ఈమె ఆఫర్స్ వచ్చే కొద్దీ రేటు కూడా భారీగా పెంచుకుంటూ పోతుంది.
ప్రెసెంట్ ఈమె రవితేజ ధమాకా సినిమాలో నటిస్తుంది.రేపు డిసెంబర్ 23న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరిపోయాయి.
రవితేజ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాపై నమ్మకంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాడు.
వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇంక భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.మరో 24 గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అంచనాలు బాగా ఉన్నాయి.

ఇక ఈ సినిమా మీదనే శ్రీలీల కెరీర్ కూడా ఆధారపడి ఉంటుంది.ఈ సినిమా భారీ విజయం సాధిస్తే శ్రీలీల ఖచ్చితంగా మరిన్ని అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటుంది అని అంటున్నారు.అలాగే స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనే టాక్ కూడా వినిపిస్తుంది.
స్టార్ హీరోయిన్ గా ఎదిగితే ఈమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు వరిస్తాయి.అలాగే ఈమె పారితోషికం కూడా భారీగా పెంచే అవకాశం ఉంది.
చూడాలి ఈ సినిమా ఈమె కెరీర్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో.







