గడ్డం తో గిన్నిస్ రికార్డ్ ఎక్కిన ఈ దేశానికి చెందిన వ్యక్తి..ఎలాగో తెలుసా..

ఈ మధ్యకాలంలో చాలామంది యూత్ గడ్డం లేకుండా కనిపించడం లేదు.అయితే ఈ కాలపు యూత్ కు గడ్డం ఒక ఫ్యాషన్.

 Usa Man Creates Guinness World Record By Hanging Christmas Bubbles To Beard Deta-TeluguStop.com

ఇది ఒక ట్రెండ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇదే స్టైల్ ని ఫాలో అవుతున్నారు.అబ్బాయిలు గడ్డం త్వరగా పెరగడానికి క్రీమ్స్, ఆయిల్స్ పూస్తూ ఉంటారు.

అలాగే ఆ గడ్డంతో ఎన్నో రకరకాలైన స్టైల్స్ ను క్రియేట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.ఇలా అమెరికాలోని ఇడాహోకు చెందిన జోయల్ స్ట్రాసర్ అనే వ్యక్తి తన గడ్డాన్ని ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాడు.

దాన్ని నిత్యం ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటాడు.

అలాగే తన గడ్డం ఎంతో ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకుంటూ తన గడ్డాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు.

అయితే ఇతను పెంచిన తన గడ్డానితో ఇప్పటికే ఎన్నో గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించాడు.తన గడ్డంతో నాలుగు గిన్నిస్ రికార్డులు సృష్టించాడు.అయితే మొత్తం ఇతను తొమ్మిది గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించాడు.అయితే ఇతను ఒక్క మనిషి 9 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించడం విశేషం అనే చెప్పాలి.

అయితే ఇతను గత మూడేళ్లుగా వరుసగా గిన్నిస్ రికార్డులు సృష్టిస్తున్నాడు.

ఇలా వరల్డ్ రికార్డ్స్ సృష్టిస్తున్న జోయల్ స్ట్రాసర్ తాజాగా మరోసారి వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు.ఈ సారి అయితే 710 బబుల్స్ తో రికార్డు కొట్టాడు.అయితే మొదటిసారి అతను 2019లో 302 బబుల్స్ రికార్డులోకి ఎక్కాడు.

అయితే మరుసటి ఏడాదిలో 542 బబుల్స్ తో అలాగే 2021లో 686 బబుల్స్ తో రికార్డును బద్దలు కొట్టాడు.అయితే క్రిస్మస్ సందర్భంగా అతను తన గడ్డానికి క్రిస్మస్ చెట్టుకు అలంకరించే బబుల్స్ తో తన గడ్డాన్ని అందంగా తీర్చిదిద్దాడు.

ఈ విధంగా తన గడ్డం తో నెటిజన్లను ఆకట్టుకొని వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube