దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాకు చుక్కెదురు అయింది.సీబీఐ కేసులో సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
అయితే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన సిసోడియా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పిటిషన్ ను విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
కాగా సిసోడియా ఫిబ్రవరిలో అరెస్ట్ కాగా ప్రస్తుతం ఆయన కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.