సర్వేలు ఇచ్చిన సంచలనం.. అధికారం హస్తం పార్టీదే !

ప్రస్తుతం దేశంలో కర్నాటక ఎలక్షన్స్( Karnataka Elections ) పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.ఇటీవల కేంద్ర ఎన్నికల సంగం ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయడంతో అందరి చూపు కర్నాటక ఎలక్షన్స్ పై పడింది.ఎన్నికలు మే 10న జరగనుండగా.13 న ఫలితాలు వెలువడనున్నాయి.ఇదిలా ఉంచితే ఈసారి కర్నాటకలో జెండా పాతేదీ ఎవరనే దానిపై పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిబేట్లు సాగుతున్నాయి.దక్షిణాది రాష్ట్రాలలో కేవలం కర్నాటకలో మాత్రమే బలంగా ఉన్న బీజేపీ( BJP ) ఈసారి కూడా అధికారాన్ని నిలుపుకోవాలని విశ్వ ప్రయత్నలే చేస్తోంది.

 Congress Party Is In Power , Congress Party, Bjp, Congress, Karnataka Elections,-TeluguStop.com

Telugu Abp Cor, Congress, Karnataka-Politics

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ( Congress party )అనూహ్యంగా పుంజుకోని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతుంది.ఇక జేడీఎస్ కూడా ఈ రెండు పార్టీలకు గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది.ఇలా హాట్ హాట్ గా సాగుతున్న కర్నాటక రాజకీయాల్లో వెలువడుతున్న సర్వేలు కాకరేపుతున్నాయి.ఏబీపీ సీఓఆర్ ఒపీనియన్ సర్వే చెప్పిన దాని ప్రకారం కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువట.

ఈ సర్వే ఫలితాల ప్రకారం 224 స్థానాలకు గాను కాంగ్రెస్ కు 115-127 సీట్లు, బీజేపీకి 68-80 సీట్లు, జేడీఎస్ కు 23-35 సీట్లు వచ్చే అవకాశం ఉందట.ఇక తాజాగా స్మాల్ బాక్స్ ఇండియా సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ కే పట్టం కట్టాయి.

Telugu Abp Cor, Congress, Karnataka-Politics

ఈ సర్వే చెబుతున్నా దాని ప్రకారం బీజేపీకి 65-70 స్థానాలు వస్తే, కాంగ్రెస్ కు 118-129 సీట్లు వచ్చే అవకాశం ఉందట.అయితే మరికొన్ని సర్వేలు మాత్రం కర్నాటకలో ఏపార్టీ కి కూడా స్పష్టమైన ఆధిక్యం రాదని, హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నాయి.మొత్తానికి ఈసారి ఎన్నికల్లో కన్నడికులు బీజేపీకి షాక్ ఇచ్చే అవకాశాలే ఎక్కువాగా ఉన్నట్లు విశ్లేషకులు సైతం చెబుతున్నారు.ఒకవేళ కర్నాటకలో బీజేపీ ఓడిపోతే దక్షిణాది రాష్ట్రాలపై కమలం పార్టీ పూర్తిగా పట్టుకోల్పోయినట్లేనని చెప్పవచ్చు.

ఇప్పటివరకు దక్షినదీ రాష్ట్రాలలో కేవలం కర్నాటకలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది.ఈసారి అది కూడా కోల్పోతే, ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై చూపే అవకాశం లేకపోలేదు.

మరి సర్వేలు చెబుతున్న దాని ప్రకారం అధికారం హస్తం పార్టీని వరిస్తుందా ? లేదా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube