ప్రపంచవ్యాప్తంగా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఒకపక్క రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.
ఇంకోపక్క ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా కంట్రోల్ లో ఉంటే చైనాలో అధిక కేసులు రావటం ఆందోళన కలిగిస్తుంది.ఇలాంటి తరుణంలో ఇండోనేషియాలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది.
పూర్తి వివరాల్లోకి వెళితే జావాద్వీపంలోని సెమెరు అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున బద్దలైంది.
దీంతో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర బూడిద గాలిలోకి ఎగిసి పడింది.
విస్ఫోటనం నుంచి ప్రజలు దూరంగా ఉండాలని… ప్రజలను ఇండోనేషియా ప్రభుత్వం హెచ్చరించింది.అగ్నిపర్వతం నుంచి ఐదు కిలోమీటర్ల లోపు ఎవరు కూడా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఇదే సమయంలో ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది.







