ఢిల్లీ మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధం అయింది.ఈ క్రమంలో మరికాసేపటిలో ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది.
అయితే తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో మేయర్ ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమమయింది.ఈ క్రమంలో ఎన్నికలు జరపాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆమోదించారు.
దీంతో ఇవాళ ఢిల్లీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు.అనంతరం డిప్యూటీ మేయర్ తో పాటు ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను కూడా ఎన్నుకుంటారు.
అయితే, మేయర్ ఎన్నికలో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా నామినేట్ చేసిన పది మంది కౌన్సిలర్లకు మేయర్ ఎన్నికలో ఓటు వేసేందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ అనుమతినిచ్చారు.ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆప్ నామినేటెడ్ సభ్యులందరూ బీజేపీకి ఓటు వేస్తారని వాదించింది.
ఈ నేపథ్యంలోనే డీఎంసీ యాక్ట్ 1957 ప్రకారం నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసే అధికారం లేదని చెప్పింది.ఈ క్రమంలోనే ఇప్పటివరకు మూడు సార్లు ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది.
దీంతో ఆమ్ ఆద్మీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఆప్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం తక్షణమే ఎన్నిక జరపాలని ఆదేశించింది.
నామినేటెడ్ సభ్యులకు ఓటు వేయవద్దని చెప్పింది.కాగా 2022 డిసెంబర్ 7న ప్రకటించిన ఫలితాల్లో బీజేపీకి 104, ఆమ్ ఆద్మీ పార్టీకి 134, కాంగ్రెస్ కు 9 సీట్లు రాగా… ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు.