శ్రీవారి లడ్డు ప్రసాదం పై టీటీడీ కీలక నిర్ణయం..

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదనికి ఉన్న ప్రాధాన్యత మాటల్లో అస్సలు చెప్పలేరు.తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత ప్రతి ఒక్కరూ ఈ ప్రసాదం ఇంటికి తీసుకొని వస్తారు.307 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ తిరుమల ప్రసాదానికి కోట్లాదిమంది భక్తులు ఎంతో భక్తితో స్వీకరిస్తూ ఉంటారు.తిరుమల లడ్డుకు వచ్చే రుచి మరెక్కడా ఉండదు.

 Ttd's Key Decision On Srivari Laddu Prasadam ,  Laddu Prasadam ,  Ttd , Tirumal-TeluguStop.com

తిరుమల లడ్డు అన్ని రకాల ప్రత్యేకమైనది.దశాబ్దాల కాలంగా ఒకే రుచితో ఎక్కడ రాజి పడకుండా ఈ లడ్డు తయారీ జరుగుతూ ఉంది.

భారీగా పెరుగుతున్న భక్తులకు లడ్డు ప్రసాదాలు అందించడంలోనూ టిటిడి తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.ఇదే సమయంలో అనూహ్యంగా పెరుగుతున్న భక్తుల రద్దీ లడ్డు ప్రసాదం డిమాండ్ నేపథ్యంలో ఇప్పుడు టిటిడి మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Telugu Andhra Pradesh, Devotional, Dharma Reddy, Laddu Prasadam, Tirumala, Ttd E

పెరుగుతున్న తిరుమల లడ్డు ప్రసాదం కోసం టీటీడీ కొత్త నిర్ణయం తీసుకుంది.ఇందుకోసం ఆత్యాధునిక యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని వస్తోంది.తిరుమలలో లడ్డుల తయారీ కోసం డిసెంబర్ నాటికి 50 కోట్లతో కొత్త వ్యవస్థ ప్రారంభిస్తున్నట్లు టిటిడి ఈవో ధర్మారెడ్డి గారు తెలిపారు.ఈ యంత్రాలు వాడుకలోకి వస్తే బూందీ తయారీకి స్టవ్ ల అవసరం ఉండదని వెల్లడించారు.

రోజుకు ఆరు లక్షల వరకు లడ్డులు తయారు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

Telugu Andhra Pradesh, Devotional, Dharma Reddy, Laddu Prasadam, Tirumala, Ttd E

ఈ యంత్రాలను జర్మనీ, ఆస్ట్రేలియా నుంచి తెప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.అవసరమైన అన్ని పదార్థాలు వేస్తే ఆ యంత్రమే లడ్డు తయారు చేస్తుందని ఈవో వెల్లడించారు.దీనీ తర్వాత పెరుగుతున్న భక్తులకు తగినంత స్థాయిలో లడ్డూలు వేగంగా సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

నాణ్యత విషయంలో ఏమాత్రం తేడా ఉండదని చెబుతున్నారు.భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో కూడా తిరుమలకు వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులో తెచ్చేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube