మంచు ఫ్యామిలీ నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని ప్రస్తుతం తక్కువ సంఖ్యలో సినిమాలు చేస్తున్న హీరోలలో మంచు మనోజ్ ఒకరు.తాజాగా మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
ఈ నెల 20వ తేదీన స్పెషల్ న్యూస్ ను పంచుకోనున్నానని మంచు మనోజ్ తెలిపారు.నేను లైఫ్ లో నెక్స్ట్ ఫేజ్ లో అడుగుపెట్టబోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
చాలా రోజులుగా నా మనస్సులో దాచుకున్న ఒక విషయాన్ని అభిమానులతో పంచుకోనున్నానని మంచు మనోజ్ కామెంట్లు చేశారు.జనవరి నెల 20వ తేదీన ఆ విషయాన్ని చెబుతానని మంచు మనోజ్ చెప్పిన నేపథ్యంలో భూమా మౌనికతో పెళ్లి గురించి మంచు మనోజ్ పంచుకోనున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మంచు మనోజ్ మౌనికల పెళ్లి ఫిబ్రవరి 5వ తేదీన జరగనుందని బోగట్టా.
మనోజ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.మనోజ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లో, అటు పర్సనల్ లైఫ్ లో సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మంచు మనోజ్ కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
మనోజ్ సొంత బ్యానర్ లో నటిస్తారో లేక బయటి బ్యానర్లలో నటిస్తారో తెలియాల్సి ఉంది.
మనోజ్ పెళ్లికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.మనోజ్ మాత్రం మంచి నటుడు అని ఆయన టాలెంట్ కు తగిన స్థాయిలో గుర్తింపు దక్కలేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.నటుడిగా మనోజ్ స్థాయి అంతకంతకూ పెరగాల్సిన అవసరం అయితే ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మంచు మనోజ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటం గమనార్హం.