ఫోర్బ్స్‌ పత్రికలో జెండా ఎగరేసిన పీవీ సింధు!

PV సింధు… పరిచయం అక్కర్లేని పేరు.భరత్ లో క్రికెట్‌ క్రీడ రాజ్యమేలుతున్న తరుణంలో బ్యాడ్మింటన్‌ మ్యాచ్‌లను కూడా చూసేలా చేసిన హైదరాబాదీ క్రీడాకారిణి పేరే PV సింధు.

 Pv Sindhu World's 12th Highest Paid Female Athlete In 2022,pv Sindhu,forbes List-TeluguStop.com

ఒలింపిక్స్‌ మెడల్‌ మొదలుకొని వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌, ఆసియా గేమ్స్‌, కామన్వెల్త్‌ ఇలా పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పతకాల వర్షం కురిపిస్తోన్న ఈ స్టార్‌ షట్లర్‌ అంటే నేటి తరం యువతకు మక్కువ ఎక్కువ.ముఖ్యంగా ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఆమెని ఆదర్శవంతంగా తీసుకుంటారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

తాజాగా ఈ తెలుగు తేజం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొని దేశం గర్వించేలా చేసింది.ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్‌ విడుదల చేసిన టాప్ 25 మహిళా క్రీడాకారిణుల్లో PV సింధు స్థానం సంపాదించుకుంది.

అత్యధికంగా ఆర్జిస్తోన్న టాప్‌-25 మహిళా అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేయగా.ఆ జాబితాలో PV 12వ స్థానంలో ఉండటం విశేషం.కాగా ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్‌, కామ‌న్‌వెల్త్‌గేమ్స్ సింగ్సిల్‌లో బంగారు పతకం, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రజత పతకాలు గెల్చుకుంది ఈ బ్యాడ్మింటన్‌ క్వీన్‌.

దాంతో స్పాన్సర్‌ షిప్‌లు, ప్రకటనల ద్వారా సింధు ఈ ఏడాది సుమారు 7 మిలియ‌న్ల డాల‌ర్లు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 58 కోట్లకు పైగా అర్జించిన‌ట్లు ఫోర్బ్స్‌ పత్రిక పేర్కొంది.ఇక జ‌పాన్‌కు చెందిన టెన్నిస్ స్టార్ ప్లేయ‌ర్ న‌వోమీ ఒసాకా రూ.423 కోట్ల ఆదాయంతో తొలి స్థానంలో ఉండటం కొసమెరుపు.ఒసాకా ఈ జాబితాలో టాప్‌ లో నిలవడం ఇది వ‌రుస‌గా ఇది 3వసారి.కాగా ఈసారి ఫోర్బ్స్‌ జాబితాలో ఎక్కువ శాతం మంది టెన్నిస్ ప్లేయ‌ర్లే ఉండడం గమనించవచ్చు.

టాప్ 10 లిస్టులో ఎమ్మా ర్యాడుకాన‌, సెరీనా, ఇగా స్వియాటెక్‌, కోకో గౌఫ్‌, వీన‌స్‌, జెస్సికా పెగులా తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube