మన భారత దేశస్తులు ప్రపంచవ్యాప్తంగా ఏ మూలన ఉన్నా క్రిస్మస్ సంక్రాంతి అంటే దాదాపు వారి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలు కాబట్టి, ప్రస్తుతం క్రిస్మస్ సంక్రాంతి పండుగలు త్వరలో రాబోతున్న నేపథ్యంలో బ్రిటన్ లో ఉన్న భారతీయులు భారతదేశానికి రావడానికి వీసా ల కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు.అందువల్ల బ్రిటన్ టు భారత్ వీసాలు రావడానికి ఎంతో ఆలస్యం అవుతోంది.
ప్రస్తుతం కోవిడ్ ఆంక్షలు తొలగించిన తర్వాత బ్రిటన్ లో భారతీయ వీసాల కోసం భారీగా డిమాండ్ పెరగడంతో వీసాలు జారీ బాగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.ఇప్పుడు పరిస్థితి కాస్త కుదుటపడడంతో క్రిస్మస్ సెలవుల్లో భారత్కు వెళ్లాలనుకునే వారికి త్వరగా భారతీయ వీసాలు జారీ అవుతున్నట్లు వి ఎఫ్ ఎస్ గ్లోబల్ సంస్థ వెల్లడించింది.
ఈ సంస్థ ఐరోప కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ ప్రభుత్వం టెక్నాలజీ సర్వీస్ లను అందజేస్తూ బిజీగా ఉంది.గత నెలలో ఈ సంస్థ లండన్ లో కొత్త కార్యాలయాన్ని ఓపెన్ చేస్తే రోజుకు రెండు వందల వీసా దరఖాస్తులు వస్తున్నాయని సమాచారం డిసెంబర్ లో అవి రోజుకు 50 కి తగ్గాయి.
అంటే మీసాల రద్దీ కాస్త తగ్గింది అని అర్థం చేసుకోవచ్చు.
దీనివలన క్రిస్మస్ సెలవులకు భారత్కు వెళ్లాలనుకునే వారు వేగంగా వీసాలు పొందే అవకాశం ఉంది.బ్రిటిష్ ప్రయాణికులకు ఈ నెల ఆరంభంలో ఎలక్ట్రానిక్ వీసా సదుపాయాన్ని మళ్లీ తిరిగి ఇచ్చేందుకు వీసాల కోసం ఒత్తిడి కొన్ని నెలల క్రితంతో పోలిస్తే 80 శాతం తగ్గినట్లు సమాచారం.అంతే కాకుండా భారత్ నుంచి బ్రిటన్ కు వెళ్లాలనుకునే వారికి 15 రోజుల్లోనే మీసాలు లభిస్తాయని ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషనర్ ప్రకటించడం విశేషం.