తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు దేశ నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.దీనివల్ల కొండపై ఎప్పుడు భక్తుల రద్దీ ఉంటుంది.
ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజలను టీటీడీ రద్దు చేసింది.ఈ నిర్ణయం టిటిడి ఎందుకు తీసుకుందంటే విగ్రహాల పరిరక్షణలో భాగంగా అగమ సలహాదారుల సూచనలు మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆదివారం రోజున స్వామి వారిని దాదాపు 76 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.ఇంకా చెప్పాలంటే స్వామివారికి తలనీలాలను దాదాపు 30 వేల మంది భక్తులు సమర్పించగా, హుండీ ఆదాయం మూడున్నర కోట్ల రూపాయలు సమర్పించినట్లు సమాచారం.
ఇంకా చెప్పాలంటే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.స్వామి వారి సర్వదర్శననికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
ఇక ప్రత్యేక ప్రవేశ దర్శననికి మూడు గంటల సమయం మాత్రమే పడుతుంది.
శనివారం రోజు స్వామివారిని దాదాపుగా 64 వేల మంది భక్తులు దర్శించుకోగా, 30 వేల మంది భక్తులు తల నీలాలను స్వామివారికి సమర్పించారు.అయితే భక్తులు కానుకల రూపంలో స్వామివారికి నాలుగు కోట్ల రూపాయలు సమర్పించారు.క్యూ కాంప్లెక్స్ లో తొమ్మిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
స్వామి వారి సర్వ దర్శనానికి శనివారం రోజు 16 గంటల సమయం మాత్రమే పట్టింది.ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది.
శ్రీవారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహించారు.ఇందులో భాగంగానే సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో దేవాలయాలు ద్వారము తెరిచిన అర్చకులు బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వర సుప్రభాత సోత్రం తో స్వామివారిని మేలుకొలిపారు.
ఆ తర్వాత స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన తరువాత ప్రతిర “సోమవారం రోజు చేసే “చతుర్ధశ కలశ విశేష పూజను టిటిడి రద్దు చేసింది.