అవును, మీరు విన్నది నిజమే.30 దాటితేనే ఇపుడు మనిషిని బద్ధకం ఆవహిస్తోంది.అలాంటిది అతగాడు 71ఏళ్ల వయస్సులో కూడా మొక్కవోని దీక్షతో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.అతనే కర్ణాటకకు చెందిన నారాయణ భట్.తాజాగా అతను తనకు నచ్చిన సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరి రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించాడు.వివరాల్లోకి వెళితే, ఉత్తర కన్నడ జిల్లాలోని శిరిసికి చెందిన నారాయణ భట్ 1973లో ప్రభుత్వ పాలీటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
ఆ సమయంలో కూడా అదే కోర్సులో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించాడు.
ఉద్యోగరీత్యా గుజరాత్ లో పనిచేసిన అతడు, 2013లో పదవీ విరమణ పొంది, తిరిగి కర్ణాటకకు వచ్చారు.
చిన్నప్పటి నుంచి తనకు ఎంతో ఇష్టమైన భవన నిర్మాణాలపైన దృష్టి పెట్టాలనుకున్నాడు.భవనాల నిర్మాణం చేపట్టాలంటే సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేయాలనీ అనుకొని సివిల్ ఇంజినీరింగ్ కోర్సు ఎంపిక చేసుకుని స్థానిక కళాశాలలో చోటు సంపాదించుకున్నాడు.అంతేకాకుండా ఆ వయసులో కూడా నిత్యా విద్యార్థిగా ప్రతిరోజూ కాలేజుకి వెళ్లేవారట నారాయణ భట్.71 ఏళ్ల వయసులో కూడా తన తోటి విద్యార్థులతో కలివిడిగా, ఉల్లాసంగా ఉండేవారట.అలా మొదటి ఏడాదిలో 91% ఉత్తీర్ణతను సాధించిన భట్ ఇటీవల వెల్లడైన ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకును సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కాగా రాష్ట్రంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం నవంబర్ 2న సత్కరించనుంది.
ఈ నేపథ్యంలో భట్.CM బసవరాజ్ బొమ్మై చేతుల మీదుగా పురస్కారం తీసుకోనున్నాడు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ… 2013లో పదవీ విరమణ పొందాను.రిటైర్డ్ జీవితాన్ని గడపడానికి సొంతవూరికి వచ్చాను.
నాకు సివిల్ నిర్మాణం గురించి మంచి అవగాహన ఉంది.అందుకే రిటైర్‌మెంట్ తరవాత ఓ నిర్మాణాన్ని స్టార్ట్ చేశాను.
అయితే దానికి సర్టిఫికేట్ అవసరం.కాబట్టి సమయాన్ని వృథా చేయకుండా.
వెంటనే సివిల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను.ఇపుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు ఎంతో ఆనందంగా వుంది అని చెప్పుకొచ్చారు.