ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.10
సూర్యాస్తమయం: సాయంత్రం 06.01
రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు
అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 ల3.30 సా.4.50 వరకు
దుర్ముహూర్తం: ఉ.7:41 ల8.32 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు వ్యాపారస్తులు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయడం మంచిది.మీరంటే గిట్టని వారి విషయాలలో తలదూరుస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకపోవడం మంచిది.
వృషభం:
ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో తొందరపాటు పనికిరాదు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
మిథునం:
ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయట పడతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.గతంలో పెట్టుబడిల నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.
సింహం:
ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కన్య:
ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.
తులా:
ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.తరచూ మారే మే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృశ్చికం:
ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ధనస్సు:
ఈరోజు మీ కుటుంబ సభ్యులు అంతా కలిసి బంధువుల ఇంటికి వెళ్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
మకరం:
ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు తిరిగే అవకాశం ఉంది.తరచూ మారే మే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కుంభం:
ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీరు సమాజంలో గౌరవ ప్రతిష్ట పొందుతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.అవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.