ప్రముఖ పాటల రచయితలలో ఒకరైన అనంత శ్రీరామ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఒక ఇంటర్వ్యూలో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ యంగ్ ఇండియా సినిమాలో నేను రాసిన పాట నాకు ఎంతో ఇష్టమని తెలిపారు.
నాకు బాల్యం అనేది అమృతప్రాయమని ఆయన తెలిపారు.నాకు 16 సంవత్సరాలు వచ్చేవరకు చిన్న బాధ కూడా తెలియదని ఆయన అన్నారు.
కుటుంబ నేపథ్యం లేదా మరేదైనా కారణం వల్ల నాకు చిన్న బాధ కూడా కలిగి ఉండకపోవచ్చని ఆయన తెలిపారు.ఎగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆకలి బాధలు తెలియవని ఆయన చెప్పుకొచ్చారు.
నేను బాపట్ల ఉంచి తిరిగి వస్తున్న సమయంలో ట్రైన్ మారాల్సి వచ్చిందని నా దగ్గర డబ్బులు లేకపోవడంతో 40 రూపాయలు అప్పు తీసుకున్నానని ఆయన తెలిపారు.అతని అడ్రస్ మిస్ కావడంతో డబ్బులు పంపలేకపోయానని ఆయన చెప్పుకొచ్చారు.
పాట రాయడం బ్రేకుల్లేని బండిని నడిపినంత కష్టమని ఆయన కామెంట్లు చేశారు.
200 ప్రేమ పాటలు రాయగా 100 కంటే ఎక్కువ పాటలు ప్రజాదరణ పొందాయని ఆయన తెలిపారు.నేను ఆరో సంవత్సరంలోనే రచన మొదలుపెట్టానని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు.నేను ఇంచుమించు 11సార్లు ప్రేమలో పడ్డానని ఆయన చెప్పుకొచ్చారు.
నేను ప్రేయసికి దగ్గరగా లేకపోయినా ప్రేమకు దగ్గరగా ఉన్నానని ఆయన తెలిపారు.
నన్ను మీడియేటర్ గా ఉంచటానికి ప్రేమ జంటలు ఇష్టపడేవని అలా నేను 11, 12 ప్రేమకథలను దగ్గరగా చూశానని ఆయన చెప్పుకొచ్చారు.ఇంతమంది ప్రేమలు అధ్యయనం చేయడంతో ప్రేమ పాటలు బాగా రాస్తున్నానని ఆయన వెల్లడించారు.నేను పాడటం ద్వారా సంగీతదర్శకుడు ఇచ్చిన ట్యూన్ కు అనుగుణంగా పాడతానో లేదో చెక్ చేసుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు.
అనంత శ్రీరామ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.