యశోద అప్డేట్ తో సమంత ఫ్యాన్స్ ఖుషి..!

సమంత లీడ్ రోల్ లో హరి అండ్ హరీష్ దర్శక ద్వయం డైరెక్ట్ చేస్తున్న సినిమా యశోద.ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

 Samantha Yashoda New Poster And Teaser Release Update, Hari And Harish,samantha,-TeluguStop.com

సినిమా లో మళయాళ నటుడు ఉన్ని ముకుందన్ కూడా నటిస్తున్నారు.అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ గ్లింప్స్ తో వచ్చిన యశోద లేటెస్ట్ గా ఓ కొత్త పోస్టర్ తో సర్ ప్రైజ్ చేస్తుంది.

ముఖం మీద చిన్న చిన్న గాయాలతో సమంత పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.ఇక పోస్టర్ తో పాటుగా సినిమా టీజర్ కి సంబందించిన అప్డేట్ కూడా ఇచ్చారు.యశోద టీజర్ సెప్టెంబర్ 9న సాయంత్రం 5.49 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమాతో సమంత సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.సెలెక్టెడ్ సినిమాలను చేసే నిర్మాత కృష్ణప్రసాద్ ఈ మూవీకి భారీ బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తుంది.

టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచాలని చూస్తున్నారు మేకర్స్.ఇక ఈ సినిమా తర్వాత సమంత గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమా చేస్తుంది.

ఈ రెండు సినిమాలతో సమంత తన సత్తా చాటాలని చూస్తుంది.బాలీవుడ్ లో కూడా సమంత వరుస సినిమాలు, వెబ్ సీరీస్ ఆఫర్లు అందుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube