ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామివారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు.వినాయకచవితి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి మొక్కులు చెల్లించారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీశైలంలో యాంఫీ థియేటర్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించిన కిషన్ రెడ్డి.పనుల జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆలయానికి దూరంగా నిర్మించడం ఏంటని ప్రశ్నించారు.ఇలా అయితే యాంఫీ థియేటర్ కు భక్తులు ఎలా వస్తారని అడిగారు.