బ్రిటన్ ప్రధాని ఎన్నిక : టీవీ డిబేట్‌లో రిషి సునాక్‌ను ఓడించిన లిజ్ ట్రస్

బోరిస్ జాన్సన్ రాజీనామాతో ఖాళీ అయిన బ్రిటన్ ప్రధాని పదవి కోసం కన్జర్వేటివ్ పార్టీలో ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.ప్రధానంగా భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.

 Uk Pm Election: Liz Truss Beats Rishi Sunak In Tv Debate In Poll Of Electoral Co-TeluguStop.com

ప్రస్తుత సరళిని పరిశీలిస్తే.రిషి పోటీలో కాస్త వెనకబడినట్లుగా కనిపిస్తోంది.

తాజాగా జరిగిన టీవీ చర్చా కార్యక్రమంలో సునాక్‌పై లిజ్ పైచేయి సాధించినట్లు విజేతను ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ తెలిపింది.పోల్‌స్టర్ ఒపినియమ్‌లో 47 శాతం మంది ట్రస్‌ వైపు.

రిషి సునాక్‌కు 38 శాతం మంది మద్ధతుగా నిలిచారు.అయితే.

ఈ డిబేట్‌ను వీక్షించిన సాధారణ ఓటర్ల పోల్‌లో మాత్రం లిజ్ ట్రస్‌ను రిషి సునాక్ స్వల్ప తేడాతో ఓడించారు.ఒపినియం ప్రకారం.39 శాతం మంది సునాక్ వైపు, 38 శాతం మంది లిజ్ ట్రస్ వైపు నిలిచారు.

ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో వున్న స్టోక్ ఆన్ ట్రెంట్ అనే పట్టణంలో జరిగిన ఈ చర్చా కార్యక్రమం వాడివేడిగా సాగింది.

తన దూకుడైన ప్రసంగంతో రిషి అందరినీ ఆకట్టుకున్నారు.పోటీదారులిద్దరూ పన్ను తగ్గింపులపై ఘర్షణ పడ్డారు.చైనా పట్ల బ్రిటీష్ విధానం ఎప్పుడూ కఠినంగా వుండాలని ఇద్దరూ అంగీకరించారు.బ్రిటన్ సహా పశ్చిమ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు చైనా దుర్మార్గపు కార్యకలాపాలను చూసిచూడనట్లు వదిలేశారంటూ రిషి సునక్ మండిపడ్డారు.

చైనాకు రెడ్ కార్పెట్ పరచడం తన హయాంలో జరగదని పేర్కొన్నారు.అలాగే జాన్సన్ పట్ల విధేయతకు సంబంధించి రిషి సునాక్ ఖజానా ఛాన్సెలర్ పదవికి రాజీనామా చేశారు.

దీంతో జాన్సన్‌పై ఒత్తిడి పెరిగి.చివరికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

కానీ లిజ్ ట్రస్ మాత్రం విదేశాంగ కార్యదర్శిగా కొనసాగారు.ఇద్దరూ కూడా తమ వ్యతిరేక వైఖరిని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.

నిబంధనలను ఉల్లంఘించి కరోనా సమయంలో పార్టీలో పాల్గొన్న బోరిస్ జాన్సన్‌కు లండన్ మెట్రోపాలిటన్ పోలీసుల నేపథ్యానికి వ్యతిరేకంగా చర్చ జరిగింది.

Telugu Boris Johnson, China, Conservative, Liz Truss, Rishi Sunak, Stoke, Tv, Uk

ఇకపోతే.యుగోవ్ కన్జర్వేటివ్ సభ్యుల పోల్‌లో రిషి సునాక్ ఒక్కసారిగా 62 శాతం నుంచి 38 శాతానికి పడిపోయారు.వచ్చేవారం ఓటింగ్ ప్రారంభమై.

సెప్టెంబర్ 2 వరకు జరగనుంది.మరి ఈ కాలంలో ట్రస్‌ను ఇరుకునపెట్టడానికి తగిన గ్రౌండ్ వర్క్‌ను రిషి రూపొందించలేదని విశ్లేషకులు అంటున్నారు.మొత్తం 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు బ్రిటన్ కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు.మెజారిటీ సభ్యులు ఎటు మొగ్గుచూపితే వారే తదుపరి ప్రధాని.ఆగస్ట్ 4 నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకు 12 విడతలుగా ఈ ఎన్నికలు జరగనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube