ఆర్ఆర్ఆర్‌పై ఆ స్టార్ రివ్యూ.. నెట్టింట్లో జోరుగా రచ్చ రచ్చ!

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్.

 Porn Star Kendra Lust Tweet Rrr Movie Goes Viral , Porn Star , Rrr , Kendra Lust-TeluguStop.com

ఏడాది మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డులను సృష్టించింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

కాగా ఈ సినిమాలో నటించిన ఇద్దరు స్టార్ హీరోలు పాన్ ఇండియా స్టార్ లుగా మారిన విషయం తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ లో దుమ్ము లేపుతోంది.

ఈ సినిమాపై టాలీవుడ్, బాలీవుడ్,హాలీవుడ్ లో ఇలా అన్ని ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలు, సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాపై ఒక పోర్న్ స్టార్ పొగడ్తల వర్షం కురిపించడంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఓటీటీ లో ప్రసారమవుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన స్టార్ కేండ్రా లస్ట్ ట్విట్టర్లో ఈ విధంగా రాసుకొచ్చింది.

నెట్ ఫిక్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమాను చూశాను చాలా అద్భుతంగా ఉంది.రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటన, స్టంట్స్, డైలాగ్ డెలివరీ, పాటలు సినిమాటోగ్రఫీ ఇలా ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్ గా ఉంది.హీరోలు ఇద్దరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు.

వారి ఇద్దరి నటన కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆత్మ లాంటిది అంటూ ట్వీట్ చేసింది.అయితే ఆమె ట్వీట్ పై స్పందించిన పలువురు నెటిజెన్లు మరిన్ని ఇండియన్ సినిమాలు చూసి తన అభిప్రాయం చెప్పాలి అని కోరుతున్నారు.

ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ నడుస్తోంది.

https://twitter.com/KendraLust/status/1546198948133609472?t=pyw3mQ47tYnCYsHd_XOm9Q&s=19
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube