జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో ప్రతి ఒక్కరు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా యోగా చేయడం వల్ల కలిగే ప్రాధాన్యతల గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు వివిధ రకాల యోగాసనాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యోగా ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మే 27వ తేదీ ఎల్బీ స్టేడియంలో యోగ ఉత్సవ్ ను ప్రారంభించింది.నేటి (జూన్ 21) వరకు ఈ యోగా ఉత్సవ్ కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఇక నేడు యోగా దినోత్సవం కావడంతో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు.ఇకపోతే నందమూరి నట సింహం బాలకృష్ణబసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ వివిధ రకాల యోగాసనాలు వేసి అందరిని ఆకట్టుకొని అనంతరం యోగ ప్రాధాన్యత గురించి వివరించారు.
ప్రతిరోజు యోగాసనాలు చేయడం వల్ల మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందని అందుకే ప్రతిరోజు యోగ తప్పనిసరి అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ యోగ ప్రాధాన్యత తెలియజేశారు.బాలకృష్ణ మాత్రమే కాకుండా ఇతర సెలబ్రిటీలు సైతం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాసనాలు చేస్తున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.