శ్రీరామ చంద్రుడికి ఎంగిలి పండ్లు పెట్టిన శబరి వృత్తాంతం ఏమిటి?

శబరి మతంగ మహర్షి శిష్యురాలు.ఒక బోయ వనిత.

వృద్ధురాలు.

నదీ తీరాశ్రమంలో నివసించింది.

పంపానదీ స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణీమ్ శ్రమణీం ధర్మ నిపుణామభిగచ్ఛేతి రాఘవ అని శబరిని గూర్చి వాల్మీకి మహర్షి బాల కాండలో వ్రాశాడు.ఆమె ధర్మ చారిణి, ధర్మనిపుణ.

ఆమె కడకు వెళ్లాడు రాముడు లక్ష్మణ సహితుడై.విశ్వనాథ ఈమెను తపో హింసిగా అభివర్ణించాడు.

Advertisement

సీతా వియోగంతో కలత చెంది సంక్షుభితమై వేదనా నదిలో కొట్టుకు పోతున్న రామునకు, తన పరిచర్యలతో కలత తీర్చిన యోగహంసి ఆమె.రామాయణం ఆమె జన్మ వృత్తాంతాన్ని ఎక్కడా పేర్కొనలేదు.రాముని కాలంలో బోయ కాంతలు కూడ తపస్సిద్ధిని పొందారనటానికి ఈమె సాక్షి.

రాముడు చిత్ర కూటానికి వచ్చిన వేళలోనే మతంగ మహర్షి బ్రహ్మ లోకానికి వెళ్లాడు.వెళుతూ వెళుతూ శబరితో శబరీ! రాముడు అరణ్య వాస కాలంలో మన ఆశ్రమానికి వస్తాడు.

నీవిక్కడే ఉండి ఆయనకు అతిథి మర్యాదలు ఆచరించి అపుడు బ్రహ్మ లోకానికి రావలసిందని శాసించి వెళ్ళాడు.అప్పటి నుండి రాముడు ఆశ్రమానికి వచ్చే వరకు ఆమె ప్రతి నిత్యం ఆయన కొరకు నిరీక్షి స్తూనే ఉన్నది.

సీతాన్వేషణ కోసం రామ లక్ష్మణులు దండకారణ్యంలో వస్తూ కబంధని సంహరించారు.ఆతడు కూడ శబరి ఆశ్రమం దర్శించి వెళ్ళ వలసిందని చెప్పాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
These Face Packs Help To Get Smooth Skin Details Face Packs

రాముడు లక్ష్మణ సహితుడై ఆశ్రమానికి వెళ్ళాడు.ఆమె రాముని పాదాలకు నమస్కరించి ముద్దాడి, తన గురువైన మతంగ మహర్షి మాహాత్మ్యన్ని వర్ణించి, ఆయన అనుజ్ఞ గ్రహించి యోగ మాయను కల్పించి, యోగాగ్నిలో దగ్ధమై బ్రహ్మ లోకానికి పోయింది.

Advertisement

శబరి ప్రతి దినం అడవిలోనికి పోయి మంచి ఫలాలను ఏరి కోరి, వానిని కొరికి రుచిచూచి, తీయని ఫలాలను రాముని కొరకు ఉంచేదట.పుల్లనివి పారేసేది.

అలా ఆమె రాముడు అరణ్య వాసానికి వచ్చిన దినం మొదలు తమ ఆశ్రమానికి వచ్చే వరకు, ప్రతి దినం చేసేది.ఆ సాయంకాలానికి వాటిని పార వేసేది.

మళ్ళీ ఉదయం కొత్త ఫలాలు తెచ్చేది.రామ లక్ష్మణులు రాగానే వారికా ఎంగిలి ఫలాలు ఇచ్చిందట.

రాముడెంతో ఆప్యాయతతో వాటిని భక్షించాడట.

తాజా వార్తలు