పెట్రోల్, డీజిల్ ధరలు చూస్తుంటే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.సామాన్యులకు సైతం చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతూనే ఉన్నాయి.
రోజు రోజుకు దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్ల ధరలు ఆకాశాన్నంటటంతో ప్రజలు ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.పెరిగిపోతున్న పెట్రోల్ ధరల విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క పెట్రోల్ ధరలే కాదు, రోజువారీ నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర ఎప్పుడో సెంచరీ దాటేసింది.ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.120 వరకు ఉంది.ఒక పక్క గవర్నమెంట్ ను ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్న ఏ మాత్రం లాభం లేదు.ప్రజలు సైతం మోటార్ వెహికల్స్ ను పక్కన పడేసి మళ్లీ సైకిల్ బాట పట్టారు.
ప్రజలు రోజురోజుకు పెట్రోల్ ధరల పెంపు విషయంలో రకరకాల నీరసనలను చేపట్టారు.పెట్రోల్ ధరలు విషయంలో వస్తున్న మీమ్స్, ట్రోల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక అమ్మాయి వినూత్న రీతిలో పెట్రోల్ ధరల విషయంలో నిరసన చేపట్టింది.ఏకంగా బార్ ముందు నుంచుని ఒక ఫ్లగార్డ్ పట్టుకుని దాని మీద ‘ఇప్పుడు పెట్రోల్ కన్నా బీర్ చాలా చీప్ గా దొరుకుతుంది కాబట్టి ఇకమీదట ఎవరు కూడా బండ్లు నడపకండి.అందరూ మద్యం తాగండి’ అంటూ రాసి ఉన్న ప్లగార్డ్ ను పట్టుకుని బార్ ముందు నుంచుని నీరసన వ్యక్తం చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
ఇది చూసి నెటిజన్లు సైతం అవును నిజమే… పెట్రోల్ బదులు ‘బండ్లు కూడా మనుషుల వలె మందు కొట్టి నడిస్తే బాగుండు’ అని కామెంట్ చేస్తున్నారు.