వటపత్రశాయి అంటే మర్రి ఆకు మీద నిద్రించే భగవంతుడు అని అర్థం.శ్రీమహా విష్ణువు వటపత్రంపై బాల రూపంలో శయనించిన వృత్తాంతం మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంది.
మార్కండేయుడు మృత్యుంజేయుడు.వేదాలు అధ్యయనం చేసిన ఆయన మహాతపస్వి.చాలా కాలం విష్ణువును పూజించి మృత్యుంజయుడు అయ్యాడు.మార్కండేయుడు ఆరు మన్వంతరాల కాలం పాటు నారాయణున్ని ఆరాధించాడు.ఏడో మన్వంతరంలో ఇంద్రుడు అతడి తపస్సుకు భంగం కల్గించేందుకు అప్సరసలను పంపించాడు అయినా మార్కండేయుడు వారిని చూసి ఏమాత్రం చలించలేదు.అప్పుడు నరనారాయణ రూపంలోని భగవంతుడు ప్రత్యక్షమై మార్కండేయుడికి వరమిచ్చాడు.
ఆ సమయంలో మార్కండేయుడు తనకు ఏ కోరికలూ లేవని దేవదేవుని మాయను చూడాలని ఉందని కోరుకున్నాడు.భగవంతుడు సరే అని అంతర్థానం అయ్యాడు.
ఆ తర్వాత విష్ణువును కొంత కాలం అలాగే పూజించాడు.ఒకసారి పెద్గాలి వీచింది.ఎడతెగని కుండపోతగా వర్షం కురిసింది.4 సముద్రాలు పొంగాయి.భూమి నీట మునిగింది. మార్కండేయుడు భయపడ్డాడు.మోహశోకాలు అతణ్ణి ఆవరించాయి.విష్ణు మాయకు లోనై అతడలా అనేక సంవత్సరాలు నీటిపై పరిభ్రమించాడుయ అలా తిరుగుతూ తిరుగుతూ ఒక చోట లేత మర్రి చెట్టును చూశాడు.
ఆ చెట్టు ఆకుపై శయనించిన ఒక బాలుడు అతనికి కనిపించాడు. ఆ బాలుడు తన తేజస్సుతో తపస్సును గ్రహిస్తూ చేతి వేళ్లతో పట్టుకున్న కాలిని నోట ఉంచుకుని చీకుతూ కనిపించాడు.
ఇతడే వటపత్రశాయి అయిన ముకుందుడు.ఆ తర్వాత మార్కండేయుడు ముకుందుడి శ్వాస ద్వారా అతడి శరీరంలోకి ప్రవేశించి విశాల విశ్వాన్ని వీక్షించాడు.