కాంగ్రెస్ పార్టీలో ఇక లుకలుకలు సమసిపోయినట్టేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే వచ్చే రెండున్నరేళ్లలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటి నుండే భారీ కార్యాచరణను రూపొందిస్తున్న పరిస్థితి ఉంది.

 Is There Any More Turmoil In The Congress Party , Komati Reddy , Revanth Reddy-TeluguStop.com

అయితే పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే బలపడిన పరిస్థితి ఉంది.అయితే కాంగ్రెస్ పార్టీ వారసత్వంగా ఉన్న సీనియర్ ల మధ్య ఉన్న విభేదాలు ఇక రానున్న రోజుల్లో చాలా కఠిన సమయం కనుక అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన పరిస్థితి ఉంది.

లేకపోతే రేవంత్ ఒంటరి పోరాటంతో గతంలో కంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు వందకు వంద శాతం లేదు.అయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కెసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రజల్లో నిరసన రూపంలో వ్యక్తం చేస్తూ  బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న పరిస్థితి ఉంది.

అయితే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట రెడ్డి రేవంత్ రెడ్డిని కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన విషయం తెలిసిందే.అయితే రేవంత్ -కోమటి రెడ్డి భేటీ తరువాత కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు సమసిపోయినట్టేనని  కాంగ్రెస్ శ్రేణులు చాలా బలంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.

ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కటిగా ఉండాల్సిన ఆవశ్యకతను కాంగ్రెస్ సీనియర్ నేతలు గుర్తిస్తేనే రానున్న రోజుల్లో మరింతగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది.అయితే జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి లాంటి నేతలు ఇంకా రేవంత్ తో కలిసి పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేయనప్పటికీ వారు కూడా రేవంత్ రెడ్డి తో కలిసి నడిస్తే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Is There Any More Turmoil In The Congress Party , Komati Reddy , Revanth Reddy , Komati Reddy Venkat Reddy , Telangana Congress , Telangana Politics ,kcr , Bjp - Telugu Komati Reddy, Komatireddy, Revanth Reddy, Telangana

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube