మెగా స్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఉన్న 90 శాతం మందికి గౌరవం మరియు అభిమానం ఉంటుంది.ఆయన కుటుంబం నుండి వచ్చిన హీరోలు ఎంత మంది ఎంత పెద్ద విజయాలను దక్కించుకున్నారో అందరికి తెల్సిందే.
అలాంటి మెగాస్టార్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అంతటి అభిమానం దక్కించుకున్న చిరంజీవి ఎంతగానో గౌరవించబడుతూ ఉన్నాడు.
అలాంటి గౌరవం ఆయన సంపాదించుకోగా ఆయన కూతురు మాత్రం ఆయన కు ఇబ్బంది కలిగిస్తుంది అంటూ మెగా అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.ఇప్పటికే ప్రేమ వివాహం చేసుకుని ఆ సమయంలో తండ్రి పరువును నడి రోడ్డు మీద నిలిపిన శ్రీజ మీడియాకు పవన్ పేరును కూడా బయటకు లాగిన విషయం తెల్సిందే.
ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్ని అందరికి తెల్సిందే.పరువు తీసింది అనే విషయాన్ని వదిలేసి కూతురు ను చేరదీసి మళ్లీ పెళ్లి చేశాడు.ఇద్దరు కూడా సంతోషంగా ఉన్నారని భావిస్తున్న సమయంలో కారణం ఏంటో కాని విడి పోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలు అభిమానుల గుండెలను పిండేస్తున్నాయి.చిరంజీవి కి ఎందుకు ఇన్ని కష్టాలు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవి అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఇప్పుడు శ్రీజ విడాకుల విషయమై మరియు చిరంజీవి పరువు గురించి చర్చించుకుంటున్నారు.
చిరంజీవి ఎంతో గౌరవంగా ఇప్పటికి ఒక స్టార్ గా మెగాస్టార్ గా గుర్తింపు దక్కించుకుని వెళ్తుండగా ఇలా ఆయన కూతురు వల్ల వార్తల్లో నిలవడంతో ఆయన యొక్క మానసిక స్థితి ఏమై ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.శ్రీజ యొక్క విడాకుల విషయం అధికారికంగా బయటకు రాకుండానే పెద్ద వివాదం అయ్యింది.
ఈ విషయం లో చిరు ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.