ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.46
సూర్యాస్తమయం: సాయంత్రం 06.23
రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు
అమృత ఘడియలు: నవమి, అనురాధ సా.4.00ల 5.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.
వృషభం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
శత్రువులకు దూరంగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
మిథునం:
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
కర్కాటకం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని గడుపుతారు.
సింహం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు చేస్తారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుకుంటారు.
కన్య:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.సమయాన్ని కాపాడుకుంటారు.
తులా:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించండి.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఇతరులతో మాట్లాడే ముందు ఎక్కువగా ఆలోచించాలి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.
ధనస్సు:
ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.
మకరం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సాయంత్రం సమయంలో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.
మీనం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తవుతుంది.అంతేకాకుండా కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.
వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.
LATEST NEWS - TELUGU