మాస్ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswararao) వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో రవితేజ, నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రేణూ దేశాయ్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, జిష్షు సేన్ గుప్తా, నాజర్, హరీష్ పేరడీ, అనుకీర్తి వ్యాస్, సుదేవ్ నాయర్ వంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.
మరి ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంది అసలు ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే…
కథ:
స్టూవర్టుపురం నాగేశ్వర రావు (రవితేజ) ఈ సినిమాలో ఒక దొంగ పాత్రలో నటిస్తారు.ఈయన ఈ సినిమాలో ఎవరినైనా కొట్టేముందు లేదా ఏ వస్తువునైనా దొంగతనం చేసే ముందు చెప్పి చేయడం అలవాటు.8 సంవత్సరాల వయసులోనే తన తండ్రి తల నరకడం నుంచి మొదలు పెడితే… ఎమ్మెల్యే యలమంద (హరీష్ పేరడీ), సీఐ మౌళి (జిష్షు సేన్ గుప్తా) ప్రాణాలు తీసే వరకు టైగర్ నాగేశ్వరరావు జీవితంలో ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ.స్టూవర్టుపురం( Stuartpuram ) నేపథ్యం ఏమిటి? తండ్రి తలను నాగేశ్వర రావు ఎందుకు నరికాడు? అతను ప్రేమించిన ఉత్తరాది అమ్మాయి సారా (నుపుర్ సనన్)( Nupur Sanon ) ఏమైంది? మరదలు మణి (గాయత్రి భరద్వాజ్)తో( Gayatri Bharadwaj ) పెళ్లి వెనుక ఏం జరిగింది ఈయన దొంగలించిన ఆ డబ్బు మొత్తం ఏం చేసి టైగర్ గా మారారు అన్నదే ఈ సినిమా కథ.
నటీనటుల నటన:
ఎప్పటిలాగే దర్శక నిర్మాతలు ఈ సినిమాలో రవితేజ పాత్రను చాలా యాక్టివ్గా డిజైన్ చేశారు ఆకలితో ఉన్న పులి వేట మొదలుపెడితే ఎలా ఉంటుందో అచ్చం అంతే యాక్టివ్గా రవితేజ నటన ఈ సినిమాలో ఉందని చెప్పాలి.హీరోయిన్లు నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ వేశ్య పాత్రలో కనిపించిన అనుకీర్తి వ్యాస్( Anukeerthi Vyas ) అందంగా కనిపించారు.హీరోయిన్ గాయత్రి క్లైమాక్స్ సీన్స్ లో ఎమోషనల్ గా అందరిని ఆకట్టుకున్నారనే చెప్పాలి.ఇక రేణు దేశాయ్( Renu Desai ) హేమలత లవణం పాత్ర అద్భుతంగా నటించారు.
అనుపమ కేర్( Anupam Kher ) తన నటన విశ్వరూపాన్ని చూపించారు ఇలా ఎవరి నిర్ణయం పాత్ర వరకు వారు అద్భుతంగా నటించారు.
టెక్నికల్:
రవితేజతో సినిమా అంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ప్రేక్షకులలోకి వస్తుందో ఆ ఆలోచన విధానాన్ని డైరెక్టర్ తెరపై చూపించారని తెలుస్తోంది.కొన్ని చోట్ల కథ ఆసక్తిగా వెళ్తూ ఉన్న ఫలంగా బోర్ కొట్టే సన్నివేశాలను తీసుకువచ్చారు.ఇక కెమెరామెన్ విజువల్ పరంగా ఇంకాస్త మెరుగ్గా ఉండి ఉంటే బాగుండేది అనిపించింది.
సంగీతం కూడా పెద్దగా అనుకున్న స్థాయిలో రాలేకపోయింది.నిర్మాణ పరంగా సినిమా కూడా పరవాలేదు అనిపించిందని చెప్పాలి.
విశ్లేషణ:
టైగర్ నాగేశ్వరరావు దొంగ అనే సంగతి తెలిసిందే.అయితే ఆయన దొంగతనం చేసిన డబ్బులతో ఏం చేశారు అన్నది సినిమా పట్ల ఆసక్తిని కలిగించింది.సినిమాలో ప్రారంభమే దొంగతనాలు చూపించారు.బాల్యంలో తండ్రి తల నరకడం గానీ, ట్రైన్ రాబరీ సీన్ గానీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.అయితే… అంత హై ఇచ్చిన తర్వాత వచ్చే ప్రేమకథ ఆసక్తిగా లేదు. ఈ ప్రేమ కథకే కాస్త ఎక్కువ సమయం తీసుకోవడంతో కాస్తా బోర్ అనే ఫీలింగ్ కలుగుతుంది.కొన్ని సన్నివేశాలు రిపీటెడ్ గానే అనిపించాయి.
ప్లస్ పాయింట్స్:
రవితేజ నటన( Raviteja Acting ) అద్భుతంగా ఉంది.గాయత్రి భరద్వాజ్ ఎమోషన్ సన్నివేశాలు, అక్కడక్కడ యాక్షన్స్ అన్ని వేషాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ బోరింగ్ సన్నివేశాలు, సంగీతం మైనస్ అయింది, లవ్ స్టోరీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు, పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
బాటమ్ లైన్:
చివరిగా సినిమా గురించి చెప్పాల్సి వస్తే తన నటనతో రవితేజ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కావడం కాస్త కష్టమే.కథలో ఎమోషన్స్ బావున్నప్పటికీ… స్లో నేరేషన్ చాలా ఇబ్బంది పెడుతుంది.రవితేజ వీరాభిమానులను సినిమా మెప్పిస్తుంది రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర సినిమాలతో పోలిస్తే ఇది పరవాలేదు అనిపించింది.