రాయలసీమకు అండ పసుపు జెండా మాత్రమే: లోకేష్!

తమ పరిపాలనలో రాయలసీమకు( Rayalaseema ) కొత్త రూపు తీసుకురావడానికి నిజాయితీగా కృషి చేశామని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి లోకేష్ అన్నారు.తెలుగు గంగ నుంచి హంద్రీనీవా వరకూ ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమ ప్రజల సాగునీటి మరియు తాగునీటి అవసరాలు తీర్చింది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు.

 Lokesh Give Assurance Toward Rayalaseema Development ,  Rayalaseema Development,-TeluguStop.com

పట్టి సీమ తో రాయలసీమ కు కృష్ణా జలాలు అందించామని అంతేకాకుండా కియా, ఫాక్స్ కాన్ , టి సి ఎల్ వంటి కంపెనీలఏర్పాటుతో ఇక్కడ నిరుద్యోగాన్ని రూపుమాపడానికి నిజాయితీగా కృషి చేశామని ఆయన వివరించారు.యువగళం పాదయాత్రలో భాగంగా కడపలో “ మిషన్ రాయలసీమ’ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

Telugu Kia Company, Krishna Waters, Lokeshgive, Grid Project, Rayalaseema, Telug

రాయలసీమకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాయలసీమకు అండగా ఉండేది పసుపు జెండా మాత్రమేనని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమ కు కొత్త రూపం కల్పిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.30 నుంచి 90 శాతం పూర్తయిన అనేక పథకాలను ఈ ప్రభుత్వం ఆపివేసిందని తెలుగుదేశం( telugudesam ) ప్రభుత్వం రాగానే వాటిని పూర్తి చేసి ఆ ఫలాలను ప్రజలకు అందేలా చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Kia Company, Krishna Waters, Lokeshgive, Grid Project, Rayalaseema, Telug

జగన్ అధికారంలో ఉన్న ఈ నాలుగు సంవత్సరాలలో రాయలసీమ మరో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని, 22 వేల కోట్లతో పవర్ గ్రిడ్ ప్రాజెక్టు( Power grid project ) 90 శాతం పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం దానిని పక్కన పెట్టిందని, మా ప్రభుత్వం రాగానే పూర్తి చేసి కొత్త ఉద్యోగాలు తీసుకొస్తామని ఆయన చెప్పుకొచ్చారు మేము తీసుకొచ్చిన కీయా కంపెనీ దాని అనుబంధ పరిశ్రమల వల్ల ఎంతో మందికి మేలు జరిగిందని, చాలామంది మహిళలు నాకు ఆ కంపెనీల వల్ల ప్రయోజనం పొందామని సాధారణ మహిళలుగా ఉన్న తాము ఈరోజు కుటుంబాన్ని నడుపుతున్నామని చెప్పుకొచ్చారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.అభివృద్ధి నమూనా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని తమకు మరొకసారి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube