ఇది మామూలు కారు కాదు.. 15 నిమిషాలు చార్జింగ్ పెడితే 700 కి.మీ..

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రెండ్ నడుస్తున్నది.జనాలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

 This Is No Ordinary Car 700 Km On 15 Minutes Of Charging, Merdidez Car, Viral Ne-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆటోమొబైల్ కంపెనీలు అటువంటి వాహనాలు ఉత్పత్తి చేస్తున్నాయి.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ద్వారా ఆ సంస్థ ఇప్పటికే రూ.కోట్లు సంపాదించింది.కాగా, తాజాగా ‘అవతార్’ సినిమా స్ఫూర్తిగా కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.

‘విజన్ అవతార్’ పేరిట సరికొత్త కాన్సెప్ట్ కారు తయారు చేసింది.ఈ కారులో డ్రైవింగ్ సీటులో కూర్చున్న వ్యక్తి కారును తన ఆలోచనలతోనే నియంత్రించగలడు.

ఇదీ సదరు కారు ప్రత్యేకత.డ్రైవర్ తన మనసులో ఏసీ ఆన్ అవ్వాలను‌కుంటే చాలు.

ఆటోమేటిక్‌గా ఏసీ ఆన్ అయిపోతుందట.పాటలు వినాలనుకుంటే చాలు…ఆడియో ఆన్ అయి ఇష్టమైన పాటలు ప్లే అవుతాయి.

ఇక ఇంకో వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే.ఈ కారు కేవలం 15 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది.

ఒక్కసారి చార్జ్ చేస్తే 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు.ఇందుకుగాను కారు బ్యాటరీని గ్రాఫీన్ టెక్నాలజీతో తయారుచేశారు.ఈ కారు ఎన్విరాన్‌మెంట్‌కు ఎటువంటి హాని కలిగించదట.ఈ కారును బెంజ్ సంస్థ మ్యూనిక్ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ ఆటోమొబైల్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తోంది.దీన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Telugu Minutes, Electric Car, Merdidez Car, Travel Km-Latest News - Telugu

హైఎండ్ టెక్నాలజీతో ఈ కార్లను తయారు చేయబడగా, ఇందులో ఆర్టిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించారు.దాని ఫలితంగానే మానవుడు మనసులో ఏమనుకున్నా అది ఆటోమేటిక్‌గా కారుకు తెలిసిపోతుందని నిపుణులు వివరిస్తున్నారు.కారు తయారీకి ఇంత ఆధునికమైన టెక్నాలజీ యూజ్ చేయడం ద్వారా మానవుడికి పనులు ఇంకా సులువు చేయడమే ఉద్దేశం అవుతున్నది.

కారు బ్యాటరీని గ్రాఫిన్ టెక్నాలజీతో తయారు చేశారు.ఈ బ్యాటరీ బ్యాకప్ బానే ఉంటుందట.అయితే, ఈ కారు ధర సామాన్యుడికి అందుబాటులో ఉండే చాన్సెస్ తక్కువేనని పలువురు అంటున్నారు.ఈ కారును సంపన్న వర్గం వారి కోసమే తయారు చేశారనే వాదన కూడా కొందరు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube