స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు.ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా ఆ సినిమా పాటలు ఓ రేంజ్‌లో రికార్డులను తిరగరాసాయి.ఇంకా ‘అల వైకుంఠపురములో’ సినిమా పాటలు ప్రేక్షకుల నోళ్లల్లో నానుతూ వినిపిస్తున్నాయి.
అంతలా ఆ పాటలు జనంలోకి వెళ్లాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అయితే కేవలం అల వైకుంఠపురములో చిత్రంలోని పాటలే కాకుండా ప్రస్తుతం బన్నీ నటిస్తున్న పుష్ప చిత్రంలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా తాజాగా రిలీజ్ అయ్యి యూట్యూబ్‌ను దడదడలాడిస్తోంది.
‘దాక్కొ దాక్కొ మేక’ అనే మాస్ పాటను దేవిశ్రీ ప్రసాద్ ఎంత అరాచకంగా మ్యూజిక్ అందించి ఈ పాటను అదిరిపోయే రీతిలో స్వరపరిచాడు.దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది.
బన్నీ నటించే సినిమాల పాటలకు ఇంతలా ఆదరణ ఎందుకు లభిస్తుందని ఓసారి చూస్తే ఆయనకున్న క్రేజ్ కారణంగానే ఆ పాటలకు అంత రెస్పాన్స్ లభిస్తుందనే విషయం స్పష్టం అవుతుంది.
మెగా హీరోల్లో బన్నీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడంతో పాటు చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుండటమే ఆయనకు ఇంతా ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.
దీంతో ఆయన చేసే సినిమాలకు అదిరిపోయే ఫాలోయింగ్ ఏర్పడి, ఆ సినిమాల పాటలకు కూడా అంతే క్రేజ్ ఏర్పడుతోంది.అందుకే పుష్ప – ది రైజ్ చిత్రం పాట ఆల్ టైం రికార్డును సొంతం చేసుకుందని ఆయన అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా అంటున్నారు.
ఏదేమైనా తమ అభిమాన హీరో చిత్రాలే కాకుండా ఆయన సినిమాల్లోని పాటలు కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం తమకు సంతోషాన్ని కలిగిస్తున్నాయని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు.