కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి.ఎటు నుంచీ మహమ్మారి ముంచుకొస్తుందో తెలియక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బ్రతుకుతున్నారు.
కరోన వస్తే ఇక చావే అన్నట్టుగా భయాందోళనలకు లోనవుతున్నారు.వ్యాక్సిన్ తీసుకున్న వారికి, వ్యాక్సిన్ తీసుకొని వారికి కూడా కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఈ భయం మరింత రెట్టింపు అయ్యింది.
మరో పక్క డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న తరుణంలో అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ చేసిన వ్యాఖ్యలు అందరిలో గుబులు పుట్టిస్తున్నాయి.
డెల్టా వేరియంట్ తీవ్ర రూపం దాల్చే అవకాసం ఉందని అయితే వ్యాక్సిన్ వేసుకుంటే ఇది పెద్ద సమస్యగా మారదని, కానీ భవిష్యత్తులో మాత్రం ప్రపంచం నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుందని ఫౌచీ హెచ్చరించారు.
వ్యాక్సిన్ లకు సైతం దొరకని భయంకరమైన వేరియంట్ లు భవిష్యత్తులో వస్తాయని అందుకు అవకాశాలు కూడా ఉన్నాయంటూ బాంబు పేల్చారు ఫౌచీ.కరోనా కు అంతం లేకుండా ఇలానే వ్యాప్తిస్తూ వెళ్తే మరో సారి దీనికి మ్యూటేషన్ జరిగే అవకాశం ఉందని.
ఫలితంగా ఏర్పడే కొత్త వేరియంట్ లు ఇప్పటి వ్యాక్సిన్ లకు లొంగే అవకాసం లేదని ఫౌచీ తెలిపారు.ఫౌచీ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బిగ్ డిబేట్ నడుస్తోంది.ముందుగానే వ్యాక్సిన్ కనిపెట్టే అవకాసం లేదు, కొత్త వేరియంట్ లు వచ్చిన తరువాత దానిని బట్టి వ్యాక్సిన్ కనిపెట్టాలి.దాని ప్రభావం అప్పుడు ఎలా ఉంటుందో అంటూ చర్చించుకుంటున్నారు ప్రజలు.
ఇక అమెరికాలో దడ పుట్టిస్తున్న డెల్టా వేరియంట్ గురించి కుడా ఫౌచీ షాకింగ్ కామెంట్స్ చేశారు.అమెరికాలో డెల్టా తీవ్రత ఇలానే కొనసాగితే మాత్రం ప్రస్తుతం రోజుకు లక్ష నమోదు అవుతున్న కేసులు భవిష్యత్తులో రోజుకు 2 లక్ష్లలుగా నమోదైనా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.