ఒకప్పటి ఈ విలన్ అలాంటి వ్యాధి బారిన పడడంతో...

ఒకప్పుడు తెలుగు, కన్నడ, తమిళం, తదితర భాషలలో హీరోగా విలన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ స్వర్గీయ నటుడు “ప్రభాకర్” గురించి తెలియని వారు ఉండరు.అయితే నటుడు ప్రభాకర్ తెలుగులో 1982వ సంవత్సరంలో ప్రముఖ స్వర్గీయ నటుడు “శోభన్ బాబు” హీరోగా నటించిన “ప్రతీకారం” చిత్రంలో విలన్ పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

 Telugu Villain Tiger Prabhakar Died For Jaundice Disease-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో టైగర్ అనే విలన్ పాత్రలో నటించడంతో అప్పటినుంచి “టైగర్ ప్రభాకర్” గా తన పేరుని మార్చుకున్నాడు.నటుడు టైగర్ ప్రభాకర్ తెలుగు, కన్నడ, తదితర భాషలలో దాదాపుగా 300 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాడు.

అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా కొంతకాలం పాటు తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించాడు.తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలయ్య బాబు, విక్టరీ వెంకటేష్, తదితర స్టార్ హీరోల చిత్రాల్లో విలన్ గా నటించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులని బాగానే మెప్పించాడు.

అయితే సినీ జీవితం పరంగా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న టైగర్ ప్రభాకర్ తన వైవాహిక జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.దీంతో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.

ఇందులో 1985వ సంవత్సరంలో ప్రముఖ నటి మరియు పొలిటీషియన్ జయమాల ని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు.కానీ పెళ్లయిన మూడు సంవత్సరాలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు, విభేదాలు రావడంతో 1988వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత 1995వ సంవత్సరంలో పలు చిత్రాలను మరియు సీరియళ్లలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన కన్నడ ప్రముఖ నటి “అంజు” ని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.కానీ ఈ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలబడలేదు.

కేవలం ఏడాది వ్యవధిలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాలు రావడంతో 1996వ సంవత్సరంలో ఇరువురి అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత టైగర్ ప్రభాకర్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు.

కాగా 2000 వ సంవత్సరం నుంచి నటుడు టైగర్ ప్రభాకర్ అనారోగ్య సమస్యలతో బాధ పడేవాడు.దాంతో 2001వ సంవత్సరంలోని మార్చి 25 వ తారీఖున జాండీస్ వ్యాధి బారిన పడి మృతి చెందాడు.

దీంతో కన్నడ తెలుగు సినీ పరిశ్రమలు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాయి.

Telugu Telugu Villain, Teluguvillain, Tiger Prabhakar, Tollywood-Movie

ఈ విషయం ఇలా ఉండగా నటుడు ప్రభాకర్ దాదాపుగా 300కు పైగా చిత్రాల్లో నటించడమే కాకుండా దాదాపుగా పదికి పైగా చిత్రాలకి దర్శకత్వం కూడా వహించాడు.అంతేకాకుండా మరిన్ని చిత్రాలకి సహ నిర్మాతగా కూడా వ్యవహరించాడు.కానీ జాండీస్ వ్యాధి బారినపడిన ప్రభాకర్ ని చివరి రోజుల్లో పట్టించుకునేవారు లేక మనస్థాపానికి గురై తీవ్ర శోకంతో మరణించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube