డార్క్ స్పాట్స్ లేదా నల్లటి మచ్చలు.చాలా మందిని ఇబ్బంది పెట్టే చర్మ సమస్యల్లో ఇది ఒకటి.
ముఖం ఎంత అందంగా, తెల్లగా ఉన్నా.డార్క్ స్పాట్స్ ఉంటే మాత్రం అందహీనంగా కనిపిస్తారు.
అందుకే డార్క్ స్పాట్స్‌ను నివారించేందుకు ఫేస్ క్రీములు, లోషన్లు వాడుతుంటారు.కొందరైతే ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.అయితే న్యాచురల్‌గా కూడా డార్క్ స్పాట్స్‌కు చెక్ పెట్టవచ్చు.ముఖ్యంగా కార్న్‌ఫ్లోర్ డార్క్ స్పాట్స్‌ను నివారించడంతో ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.మరి కార్న్‌ఫ్లోర్‌ను చర్మానికి ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా కార్న్‌ఫ్లోర్, బొప్పాయి గుజ్జు మరియు తేనె వేసి బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.అర గంట పాటు ఆరనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల డార్క్ స్పాట్స్ క్రమంగా తగ్గిపోతాయి.
అలాగే ఒక బౌల్ లో కార్న్‌ఫ్లోర్, తేనె మరియు ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి.ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం కొద్దిగా ముఖంపై నీరు చల్లి మెల్ల మెల్లగా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి చేయడం వల్ల నల్ల మచ్చలు తగ్గడంతో పాటు ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఇక ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్, క్యారెట్ జ్యూస్, నిమ్మ రసం వేసి మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఫేస్‌కి ప్యాక్‌లా వేసుకుని.పావు గంట లేదా అర గంట పాటు ఆరనివ్వాలి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.