నాగార్జున వైల్డ్ డాగ్ ఓటీటీ లో విడుదల కాబోతుందా..?!

ప్రస్తుతం అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే మనాలిలో పూర్తి చేసి ఆపై మిగిలిన సినిమాని హైదరాబాదులో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

 Nagarjuna Wild Dog Movie To Release In Ott, Ott Platform, Nnetflix, Dia Mirza, N-TeluguStop.com

ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు.చాలా రోజుల తర్వాత మన్మధుడు-2 లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత కింగ్ నాగార్జున నటిస్తున్న ఈ చిత్రంపై అనేక అంచనాలు నెలకొన్నాయి.

ఇదివరకు ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరిలో ఆసక్తిని తలెత్తేలా చేస్తోంది.

అక్కినేని నాగార్జున ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ఏసిపి విజయ్ పాత్రలో నటించారు.

ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ గా దియామీర్జా నటిస్తోంది.ఈ సినిమా సినీ ప్రేక్షకులకు ఓ అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం తెలుపుతోంది.

ఇకపోతే ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది.లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో ఈ సినిమా డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

అక్కడక్కడ థియేటర్స్ ఓపెన్ చేసిన ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి లేకపోయింది.

ఈ విషయాన్ని గుర్తుంచుకొని చిత్రబృందం సినిమాని డైరెక్ట్ గా ఓటీటీ ఫ్లాట్ఫామ్ లో విడుదల చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇందులో భాగంగానే చిత్రబృందం జోరుగా ప్రయత్నాలు చేస్తోందని టాలీవుడ్ టాక్.ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ఫామ్ లో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రానికి భారీ ఆఫర్ ఇచ్చిందని.

ఆ సంస్థతో ప్రస్తుతం చిత్ర బృందం చర్చలు జరుగుతున్నాయని కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది.ఒకవేళ వీరిద్దరి మధ్య చర్చలు సఫలీకృతం అయితే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అతి త్వరలో విడుదల కాబోతోంది.

ఒకవేళ అదే జరిగినట్లయితే తెలుగు స్టార్ హీరోల సినిమా ఓటిటి ఫ్లాట్ఫామ్ లో విడుదలైన మొదటి చిత్రంగా నిలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube