జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు.అందుకు తగ్గట్టుగానే నిరంతరం కష్టపడుతూ విజయాన్ని అందుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు.
కానీ కొందరిలో ఎంత కష్టపడ్డా విజయాన్ని చేరుకోలేరు.మరి కొందరిలో తక్కువగా కష్టపడిన విజయాన్ని అందుకుంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించాలంటే రత్నాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.వివిధ రంగాలలో రాణించాలనుకునే వారు వివిధ రకాల రత్నాలను ధరించడం వల్ల అనుకున్న విజయాలను సాధిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.అయితే ఏ రత్నం ధరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
పుఖ్రాజ్ రత్నం:
రాజకీయ రంగంలో రాణించాలనుకునే వారు ఈ వజ్రాన్ని ధరించడం వల్ల ఈ రంగంలో రాణిస్తారు.ఈ వజ్రం బృహస్పతి అనుకూలంగా పరిగణిస్తారు.దీనిని ధరించడం ద్వారా బృహస్పతి స్థానాన్ని బలపరుస్తుంది.అంతే కాకుండా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
మాణిక్యం:
ఉద్యోగంలో పదోన్నతి పొందాలని భావించేవారు మాణిక్యాన్ని ధరించాలి.మాణిక్యం సూర్యుని రత్నం.ఈ రత్నాన్ని ధరించడం ద్వారా సూర్యుని వలె ఎంతో ప్రకాశవంతంగా, ధైర్యంతో ముందుకు వెళ్తారు.ఈ రత్నం ఎరుపు రంగులో ఉండటం వల్ల రక్తాన్ని సూచిస్తుంది దీనిని ధరించిన వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు.
వజ్రం:
సినీరంగానికి కళారంగానికి సంబంధించిన వారు ఈ వజ్రాన్ని ధరించడం ద్వారా ఆ రంగంలో ఉన్నత స్థానాన్ని సంపాదిస్తారు.ఈ వజ్రం ధరించడం వల్ల ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతారు.
పగడం:
న్యాయవాది, జడ్జీలు, పరిపాలన రంగంలో విజయం సాధించాలని కొనేవారు పగడాన్ని ధరించాలి.ఈ పగడాన్ని కేవలం మంగళవారం రోజున మాత్రమే ధరించాలి.అంతేకాకుండా పోలీసు శాఖ లేదా సైనిక రంగాలలో చేరాలనుకునే వారు పగడం కచ్చితంగా ధరించాలి.దీనిని ధరించడం ద్వారా మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
టాంజనిట్ రత్నాలు:
ఎవరైతే ఆకర్షితులు గా ఉండాలనుకుంటారు వారు ఈ రత్నాన్ని ధరించడం ఉపయోగకరంగా ఉంటుంది.టాంజనిట్ నీల రత్నానికి ఉప రత్నం గా భావిస్తారు.ఈ రత్నాన్ని ధరించడం వల్ల శని దేవుడి అనుగ్రహం మన మీద కలిగే ఎటువంటి శని బాధలు లేకుండా సుఖ సంతోషాలతో గడుపుతారు.
ఏదైనా రత్నం ధరించేముందు ప్రముఖ జ్యోతిష్యులను అడిగే మన జాతకరీత్యా ఎటువంటి రత్నం సరిపోతుందో తెలుసుకొని వాటిని మాత్రమే ధరించాలి.అలా కాకుండా ఏ రత్నం పడితే ఆ రత్నం ధరించడం వల్ల మన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.