తాప్సీ పన్ను( Tapsee Ponnu ).ఇటీవల తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇలా తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఆ వార్తలను ఏమాత్రం ఖండించలేదు దీంతో ఈమె రహస్యంగా తన ప్రియుడితో కలిసి ఏడడుగులు నడిచారని అందరూ భావించారు.అయితే తాజాగా తన పెళ్లికి( Marriage ) సంబంధించినటువంటి ఒక వీడియో బయటకు రావడంతో తాప్సీ పెళ్లి గురించి వచ్చిన వార్తలు నిజమేనని అందరూ భావిస్తున్నారు.

తాప్సీ మార్చి 23న ఉదయ్ పూర్‌లో .తన ప్రియుడు, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోయ్‌ను( Mathias boe )పెళ్లాడింది .వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందని తెలుస్తుంది.తాజాగా లీక్ అయినటువంటి ఈ వీడియోలో తాప్సి రాక కోసం మథియాస్ ఎదురు చూస్తూ ఉండగా ఈమె మాత్రం ఎరుపు రంగు డ్రెస్ ధరించి కళ్ళకు కళ్ళజోడు పెట్టుకొని ఎంచక్కా డాన్సులు చేస్తూ పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు ఇలా పెళ్లి వేదిక వద్దకు వచ్చినటువంటి ఆమెకు తన ప్రియుడు వెల్కమ్ చెబుతూ కనిపించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ వీడియో పై స్పందిస్తూ నిజంగానే ఈమె ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారా అంటూ ఆశ్చర్య పోవడమే కాకుండా మరికొందరు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.2013 నుంచి తాప్సీ మథియాస్ బోయ్ రిలేషన్‌లో ఉండగా.దాదాపు పదేళ్లుగా వీరి ప్రేమ బంధం కొనసాగుతుంది.మార్చి 23న వీరిద్దరూ ఉదయపూర్ ( Udaypoor )లో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇలా పెళ్లి చేసుకున్నప్పటికీ ఈమె కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారో ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించిన ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.







