మన హిందూ సాంప్రదాయాలలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.మన కుటుంబ సంతోషం, ఆనందం, సమస్యలు వంటివాటిపై వాస్తు ప్రభావం అధికంగా ఉంటుంది.
మన ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా, చెడు సంఘటనలు జరిగినా మొదటగా వాస్తు దోషాన్ని సరి చేయటం ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చని ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.వాస్తు ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులను ఎలా ఉంచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…
వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయేటప్పుడు, మంచం ఎల్లప్పుడూ నైరుతి దిశలో ఉండేలా చూసుకోవాలి.
అలాగే నిద్రపోయే సమయంలో మన తల దక్షిణ దిశవైపు ఉండేలా చూసుకోవాలి.అలా దక్షిణ దిశ వైపు తల ఉంచడం వల్ల మన శరీరంలో శక్తి ప్రవాహానికి అనుకూలంగా ఉంటుంది.
అలాగే మనకు ఎదురుగా మన ఇష్టదైవ విగ్రహం ఉండేలా చూసుకుని ప్రతిరోజు క్రమం తప్పకుండా పూజలు నిర్వహించాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి నైరుతి వైపు ఎప్పుడూ తలుపులు, కిటికీలు ఉంచడం వల్ల దొంగతనం లేదా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.
అందువల్ల వీలైనంత వరకు నైరుతి దిశలో కిటికీలు,తలుపులు లేకుండా జాగ్రత్త వహించాలి.ఒకవేళ ఇలా కుదరని సమయంలో గురువారం ఉదయం బెల్లం, పప్పు సెనగలు, రొట్టెలను ఆవుకు తినిపించడం ద్వారా ఇలాంటి దోషాలు తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.
ఎందుకంటే ఆవును లక్ష్మీదేవిగా భావిస్తారు, కనుక సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని పూజించినట్లే.
వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి ముఖ ద్వారం వద్ద ఎలాంటి తీగలు చెట్లు, ముల్ల చెట్లను నాట కూడదు.
అలాగే మురికి నీరు మన ఇంటి ముందు నుంచి ప్రవహించ కుండా జాగ్రత్త వహించాలి.ఇలా ఉండటం ద్వారా ఆ ఇంట్లో నివసించే వారు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి వాటి నుంచి ఉపశమనం పొందడానికి వినాయకుడి ప్రతిమను మన ఇంటి ముఖ ద్వారం వద్ద ఉంచడం ద్వారా మంచి జరుగు తుందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియ జేస్తున్నారు.