“క్రాక్” డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఫస్ట్ లవ్ డీటెయిల్స్..!!

రవితేజతో వరుసగా మూడు హిట్లు కొట్టి రికార్డు సృష్టించాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని.ఫస్ట్ “డాన్ శీను” ఆ తర్వాత బలుపు’తో తాజాగా క్రాక్ సినిమాతో విజయం సాధించిన గోపీచంద్ మలినేని.

 Crack Director Gopichand Malineni First Love Details, Krack,don Sreenu,balupu,ra-TeluguStop.com

ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేలా చేశాడు.ఈ సినిమా విజయంతో రవితేజ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డు స్థాయిలో థియేటర్ల వద్ద కలెక్షన్ల కొల్లగొడుతూ ఉంది.

సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని హీరో రవితేజ ఇద్దరూ పలు టీవీ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు.

ఈ క్రమంలో ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ లో ఫస్ట్ లవ్ గురించి యాంకర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ని ప్రశ్నించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన ఐదో తరగతి లో ఫస్ట్ టైం ప్రేమలో పడినట్లు చెప్పుకొచ్చారు.

ఆ టైంలో లవ్ ప్రపోజల్ డైరెక్టుగా చెప్పే అంత మెచ్యూరిటీ ఎవరికీ లేదని, గ్రీటింగ్ కార్డుల లో అవతల అమ్మాయికి తెలియకుండా వాళ్ళ పుస్తకాల్లో పెట్టడమే అని, ఆ విధంగానే తాను చేసినట్లు గోపీచంద్ మలినేని తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చారు.దీంతో పక్కనే ఉన్న రవితేజ ఐదో క్లాస్ లోనే స్టార్ట్ చేశావా అన్న మాట అన్నట్టుగా చమత్కరించారు.

ఇదే తరుణంలో సినిమా గురించి అనేక విషయాలు కూడా చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube