తెలుగు బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) అనేక వార్తల నేపథ్యం లో ప్రారంభం అయింది.ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ అంతా కూడా చాలా నార్మల్ గా ఉన్నారు.
గతంలో చాలా మంది కంటెస్టెంట్స్ కి వారంకు అయిదు నుండి ఆరు ఏడు లక్షల రూపాయలు పారితోషికం తీసుకున్నారు.కానీ ఇప్పుడు అత్యధికం మూడున్నర లక్షలు మాత్రమే అంటే అతిశయోక్తి కాదు.
కంటెస్టెంట్స్ కాస్ట్ కట్ చేసి నాగార్జునకు( Nagarjuna ) భారీ గా పారితోషికం ఇస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.ఆ విషయం లో నిజం లేదని స్టార్ మా( Star Maa ) వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
గతంతో పోల్చితే స్వల్పంగా పారితోషికం పెరిగింది.అంతే తప్ప కోట్లకు కోట్ల నాగ్ సర్ కి పారితోషికం ను ఇవ్వడం లేదు అంటున్నారు.ఆ విషయం లో జరుగుతున్న ప్రచారం మొత్తం కూడా పుకార్లే అని, అందుకే బిగ్ బాస్ గురించి నాగార్జున టీం ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు.బిగ్ బాస్ సీజన్ 7 కి నాగార్జున నో చెప్పాడని, ఆయన్ను ఒప్పించడం కోసం పారితోషికం( Nagarjuna Remuneration ) డబుల్ చేశారు, ట్రిపుల్ చేశారు అంటూ ప్రచారం జరిగింది.
కానీ అలాంటిది ఏమీ లేదు అంటూ తేలిపోయింది.నాగార్జున మరియు బిగ్ బాస్ టీమ్ మధ్య పారితోషికం విషయం లో చర్చలు జరిగిన మాట వాస్తవమే కానీ అంత భారీ గా నాగ్ డిమాండ్ చేయలేదు, వారు ఇచ్చేందుకు ఓకే చెప్పలేదు అంటూ సమాచారం అందుతోంది.మొత్తానికి నాగార్జున ఇష్టం తోనే బిగ్ బాస్ ను చేస్తున్నాడు తప్ప కష్టం గా పారితోషికం కోసం చేయడం లేదు.నాగార్జున పారితోషికం కోసం కక్కుర్తి పడే వ్యక్తి అసలు కాదు.
కనుక మీడియా లో నాగార్జున పారితోషికం గురించి జరుగుతున్న ప్రచారం మొత్తం పుకార్లే.