పురాణాల ప్రకారం మనకు మూడు లోకాలు ఉన్నాయని, అవి స్వర్గలోకం, భూలోకం, పాతాళ లోకం అని తెలుసు.స్వర్గంలో దేవతలు నివాసం ఉంటారని, భూలోకంలో పుణ్యకార్యాలు చేసి మరణించిన వారు స్వర్గానికి వెళతారని చెబుతూ ఉంటారు.
భూలోకం అంటే మానవులు నివసించే ప్రాంతం.ఇక్కడ అనేక జీవరాశులు, మానవులు నివసిస్తూ ఉంటారు.
మరి పాతాళ లోకం అంటే ఏమిటి? పాతాళ లోకంలో ఎవరు నివసిస్తుంటారు? అక్కడ ఎలా ఉంటుంది అన్న అనుమానాలు వస్తుంటాయ్.మరి పాతాళలోకం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాని గురించి తెలుసుకోవాలనుకున్నారా? అయితే ఇక్కడ తెలుసుకోండి!
హిందూ పురాణాల ప్రకారం పాతాళ లోకం భూమి కింద భాగంలో ఉంటుందని, ఇక్కడ రాక్షసులు, యక్షులు, నాగ దేవతలు నివాసం ఉంటారని చెబుతాయి.విష్ణు పురాణం ప్రకారం నారదుడు పాతాళ లోకాన్ని సందర్శిస్తాడు.మూడు లోకాలలో ఎక్కడికైనా వెళ్లే అనుమతి ఒక్క నారదుడికి మాత్రమే ఉంది.పాతాళం అంటే చనిపోయే వాతావరణాన్ని సృష్టించడం అని నారదుడు తెలియచెప్పాడు.పాతాళంని చూస్తే స్వర్గ లోకం కన్నా అందంగా ఉందని, ముగ్ద మనోహరంగా ఉందని చెబుతూ ఉంటారు.
వాస్తవానికి అది నిజం కాదు కేవలం భ్రమ మాత్రమే.
విష్ణు పురాణం ప్రకారం పాతాళ లోకంలో ఏడు రాజ్యాలున్నాయి అవి అతల, వితల, నతల, మహాతల, సుతుల, పాతాళ, తలాతల అనే ఏడు రాజ్యాలు ఉంటాయి.
పాతాళ లోకంలో సూర్యరశ్మి ఉండదు అంతా చీకటిగా ఉంటుంది.ఆభరణాలు మెరుపు కాంతిలో పాతాళ లోకం సహజ కాంతిని ప్రదర్శిస్తుంది.ఇక్కడ రాజభవనాలు, దేవాలయాలు, ధర్మశాలలు నిర్మించారని విష్ణు పురాణంలో రాసుంది.ప్రముఖ ఖగోళ శాస్త్రంలో సూర్య కేంద్రక సిద్ధాంతం ప్రకారం, భూమి దక్షిణార్థ గోళంలో పాతాళం, ఉత్తరార్థ గోళంలో జంబుద్వీపం ఉన్నాయని కొందరు చెబుతారు.